Adi Srinivas: నాలుగు సంక్షేమ పథకాలు అమలవుతుంటే బీఆర్ఎస్ తట్టుకోలేక పోతుందన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఓర్వలేక కడుపు మంటతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పథకాలు అందిన ప్రజలు సంతోషంగా ఉంటే.. కేసీఆర్, కేటీఆర్ కడుపు మంటతో ఉన్నారు. నిజమైన డమ్మీలు బీఆర్ఎస్ నాయకులు వారేనని ఎద్దేవా చేశారు.
ఫ్రస్ట్రేషన్‌లో గ్రామ సభలను అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ పార్టీ ఫెయిలయ్యిందన్నారు. ఇంతకీ హరీష్‌రావుకు బుర్ర ఉందా? రాష్ట్రంలో పెద్ద డమ్మీలు ఎవరో తెలుసు అందరికీ తెలుసన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను డమ్మీలను చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
ప్రజలు సంతోషంతో ఉంటే కేవలం నలుగురు నాయకులు మాత్రమే దుఃఖంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. హరీష్‌రావు, కేటీఆర్‌లు ఫస్ట్రెషన్‌లో ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదన్నారు. ఒకసారి మూడు రోజులు, మరోసారి మూడు నెలల్లో తమ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారన్నారు. కళ్ళు కాయలు కాచేలా ఇన్నాళ్లు ఎదురుచూసిన రేషన్ కార్డులను అందుకున్న ప్రజలు సంతోషంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. పథకాలు ప్రారంభం రోజు 600 గ్రామాల ప్రజలకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు అందజేశామని గుర్తు చేశారు.
ALSO READ: 30న బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ఏం చెప్పారంటే?