BigTV English

Telangana govt will appoint new chairman: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, కొత్త ఛైర్మన్ కోసం..

Telangana govt will appoint new chairman: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, కొత్త ఛైర్మన్ కోసం..

Telangana govt will appoint new chairman(TS today news): విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్‌ను రేవంత్‌ రెడ్డి సర్కార్ నియమించనుంది. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన మాజీ న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. నేడు గానీ రేపుగానీ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనుంది ప్రభుత్వం.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నియమించిన కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి తప్పుకున్నారు. దీంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు లేదా ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరికి విచారణ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. ఈ ప్రక్రియను ఐదురోజుల్లోపు పూర్తి చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా కమిషన్‌కు కొత్త ఛైర్మన్ కోసం హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేక రాయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. పాత కమిషన్ ఇప్పటికే పలు ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగియ నుంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ తప్పుకోవడంతో విచారణ మళ్లీ మొదటికి వచ్చింది.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం వంటి వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రేవంత్ సర్కార్ దర్యాప్తు నకు ఓ కమిషన్ వేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి ఆ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. దర్యాప్తులో భాగంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఛైర్మన్ మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

ALSO READ: బస్సులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్

తొలుత కొంత గడువు కావాలని కోరారు కేసీఆర్. ఆ తర్వాత కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా ముందుకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలని కోరారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలలో జస్టిస్ నర్సింహా రెడ్డి ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×