Dasara – Gandhi Jayanti: అక్టోబర్ 2న అనగానే అందరికి టక్కున గుర్తుకొచ్చేంది.. మహాత్మగాంధీ జయంతే కదా. ఆ రోజులు వైన్స్, బార్లు, నాన్‌వేజ్ షాపులన్నీ బంద్ చేస్తారు. గాంధీని ఎక్కడిక్కడ నివాళులు అర్పిస్తారు. ఇది ఏటా జరిగేదే. బట్ ఈసారి మాత్రం చిన్న కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే అదే రోజున తెలంగాణలో అతిపెద్ద పండగైన దసరా కూడా అదే రోజు కాబట్టి. తెలంగాణలో దసరా అంటేనే సుక్కా.. ముక్కా. అలాంటి రోజునే గాంధీ జయంతి వస్తోంది. మరి ఆ రోజు ఏం జరగబోతుందన్నదే ప్రతి ఒక్కరి మైండ్‌లో 100 మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆ రోజు లిక్కర్, మీట్ షాపులు తెరిచే ఉంటాయా?
ఒకపక్క జాతిపిత మహాత్మగాంధీ జయంతి, మరోపక్క దసరా పండుగ. ఈ రెండు ముఖ్యమైన రోజులు ఒకే తేదీన.. అంటే అక్టోబర్ 2న రావడంతో ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఈసారి మద్యం, మాంసం షాపులు తెరిచే ఉంటాయా? లేక మూసివేస్తారా అన్నదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఒకే రోజు గాంధీ జయంతి, దసరా పండుగ.. మాంసం, మద్యం విక్రయాలపై ఆసక్తికర చర్చ..
ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున.. దేశమంతా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేదం ఉంటుంది. జీహెచ్ఎంసీ కూడా హైదరాబాద్‌లో కబేళాలు, చికెన్, మటన్ షాపులు మూసేయాలని ముందుగానే ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఈసారి పరిస్థితి మొత్తం మారిపోయింది.
మూసివేయాలని ఆదేశించాలా? మినహాయింపు ఇవ్వాలా? తర్జనభర్జన పడుతున్న అధికారులు..
దసరా పండుగ అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. అసలు ఆ రోజున సుక్కా.. ముక్కా లేనిదే మన తెలంగాణలో పండుగ ఉండదు. అలాంటి రోజును సెంటిమెంట్‌గా గౌరవించాలా? లేక గాంధీ జయంతి నిబంధనలను పాటించాలా? అన్నది అధికారుతు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అధికారులు ఎంత కట్టడి చేసినా.. పండుగ రోజున రహస్యంగానైనా విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఈ గందరగోళంలో అధికారులు ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.
Also Read: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగల కొట్టిన టీచర్..
అక్టోబర్ 2న ఏం జరగబోతుంది?
సాధారణంగా వచ్చే మూసివేత ఆదేశాలు ఈసారి కూడా రొటీన్‌గా వస్తాయా? లేక దసరా పండును దృష్టిలో పెట్టుకుని మినహాయింపు ఇస్తారా అన్నదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ లేదు ఎక్సైజ్ శాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మరి ఇప్పడు అక్టోబర్ 2న ఏం జరగుందన్నదే ఆకస్తిగా మారింది. సెంటిమెంటా? దేశభక్తా అన్నదే పాయింట్. ఇంకా కొన్ని రోజులు టైమ్ ఉంది కాబట్టి ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.