E-Paper
Advertisement

తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!

తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!
Advertisement

Telangana Heatwave: రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం కాగానే బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే తెలంగాణలో ఎండల దాడికి వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మంది మృతి చెందినట్టు వార్తలోచ్చాయి. దీనిని బట్టి మనం ఎండ ఏ తీవ్రతలో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వరంగల్‌లో నిన్న ఒక్కరోజు వడ దెబ్బకు 20 మంది మృతి చెందారు.

నేటి నుంచి రోహిణి కార్తి..

గత మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో వాతావరణ శాఖ తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య..!

రాబోయే రోజుల్లో..

రాష్ట్రంలో ఒక్కరోజే 42 మంది వడదెబ్బ కారణంగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 17 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, నల్గొండ జిల్లాలో కూడా వడదెబ్బ ఘటనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.అగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల రాష్ట్రంలో నేల ఉపరితల ఉష్ణోగ్రతలు 100 డిగ్రీలకుపైగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా 43–46°C వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వడదెబ్బ నివారణ కోసం నీరు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బైటికి రావద్దని అధికారులు సూచించారు.

Advertisement

Also read: దారుణం.. కన్నతల్లి పై అఘాయిత్యానికి పాల్పడిన కొడుకు

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×