E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!

డేంజర్ బెల్స్.. తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Advertisement

Heatwave Alert: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మరింత దంచి కొడుతున్నాయి. జనం వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని ముతారం ప్రాంతంలో ఏకంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే తేదీ నాటికి ఈ ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రతలు 39.7 డిగీలు నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో కనిష్టంగా 42.8 డిగ్రీల టెంపరేచర్ నారాయణపేట జిల్లాలోని రేవల్లి ప్రాంతంలో నమోదైంది. ఇదే ప్రాంతంలో గత సంవత్సరం ఇదే తేదీ నాటికి గమనిస్తే 37.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ సారి ఏకంగా అయిదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.

రానున్న మూడు నాలుగు రోజులు..

రాష్ట్రంలోని పది జిల్లాలో 45 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ఆరేంజ్ అలర్ట్ ప్రకటించగా, మిగిలిన మొత్తం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు భానుడి భగభగ మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నాం పూట అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చే వారు వడగాలి తగలకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. గతేడాది వేసవితో పోల్చితే ఈ సారి ఎండలు మండిపోతున్నట్లు నమోదవుతున్న ఉష్ణ్రోగ్రతలతో వెల్లడవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల కన్నా ఎక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 42. 4 డిగ్రీలుగా నమోదయ్యాయి.

Advertisement

Also Read: బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే.. మీ జీవితాన్ని అమ్ముకున్నట్లే.. సైబర్ క్రైమ్ డీసీపీ వార్నింగ్

గరిష్ట ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలు..

ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు బాగా మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగి మధ్యాహ్నాం కల్లా ఎండలు ముదిరి, పలు జిల్లాల్లో 46 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. వాహాన రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలోని మెయిన్ రోడ్లన్నీ మధ్యాహ్నాం పన్నెండున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్య రాకపోకలు పలుచబడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బుధవారం హైదరాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలు నమోదు కాగా, గత వేసవి కాలంలో ఇదే సమయానికి 37.3 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో ఎండ, వేడిమి, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్లు, ప్యాన్లు వంటివి వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం కూడా బాగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి గతేడాది వేసవి కాలంలో గరిష్టంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ సారి అన్ని జిల్లాల్లో కలిపి సగటున 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది.

23 జిల్లాల్లో రెడ్ అలర్ట్

Advertisement

పెద్దపల్లిలో గరిష్టంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటంతో సూర్యపేట, భధ్రాధ్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్, మంచిర్యాల్, ములుగు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మహాబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాధాద్రి భువనగిరి, అదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి, జనగాం, మెదక్ జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్లు రికార్డు కావటంతో ఆ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Alao Read: ఫోటో కోసం పుస్తెల తాడు అడిగి పరార్.. 90 నిమిషాల్లో దొంగ అరెస్ట్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×