Tata Car Discounts November 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయి, ఈ నెలలో టాటా కార్లపై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2026లో టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్, CNG కార్లపై స్పెషల్ బెనిఫిట్స్ ప్రకటించింది. ఇందులో కొత్తగా వచ్చిన సియెర్రా నుంచి నెక్సాన్, కర్వ్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వరకు పలు మోడళ్లు ఉన్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు లభిస్తున్నాయి.
కొత్త టాటా సియెర్రాపై ఈ నెలలో గరిష్ఠంగా రూ.1.15 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. డీజిల్ అకంప్లిష్డ్ వేరియంట్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్యూర్, అడ్వెంచర్ వేరియంట్లపై రూ.95,000 వరకు, స్మార్ట్+ బేస్ వేరియంట్‌పై రూ.70,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై కూడా ఎంపిక చేసిన మోడళ్లకు రూ.70,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.
నెక్సాన్ పెట్రోల్ మాన్యువల్ ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.75,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.55,000 నగదు తగ్గింపు, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. CNG వేరియంట్లపై రూ.60,000 వరకు, ఇతర ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లపై రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. డీజిల్ మోడళ్లపై రూ.20,000 వరకు బోనస్ ఉంది.
సెప్టెంబర్‌లో వచ్చిన Series X మార్పులకు ముందు ఉన్న కర్వ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.45,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 లాయల్టీ ఆఫర్ ఉన్నాయి. కొత్త Series X వేరియంట్లపై రూ.20,000 లాయల్టీ బెనిఫిట్స్ మాత్రమే అందుబాటులో ఉంది.
స్మార్ట్ బేస్ వేరియంట్ మినహా ఎంపిక చేసిన పెట్రోల్, డీజిల్ మోడళ్లపై రూ.35,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. CNG వేరియంట్లపై రూ.55,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.
టాటా హారియర్, సఫారీ డీజిల్ వేరియంట్లపై రూ.45,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. టర్బో పెట్రోల్ హారియర్‌పై ప్రస్తుతం ఆఫర్లు లేవు.
పాత వెర్షన్ టియాగో కార్లను అమ్మేందుకు టాటా ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. XE బేస్ వేరియంట్ మినహా మిగతా పెట్రోల్, CNG మోడళ్లపై రూ.35,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.
టాటా టిగోర్ స్టాక్‌ను క్లియర్ చేసేందుకు అన్ని వేరియంట్లపై రూ.30,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, మరో రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.
Read Also: టాటా కార్లపై నవంబర్ బంపర్ ఆఫర్లు.. సియెర్రాపై ఏకంగా రూ.1.15 లక్షల తగ్గింపు!