E-Paper
Advertisement

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!
Advertisement

Samsung Galaxy A18 4G: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో సరికొత్త మెుబైల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘A’ సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ A18 4G’ని మార్కెట్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, క్వాలిటీ డిస్ ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఇది ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో అందుబాటులో వచ్చిన ఈ ఫోన్.. త్వరలోనే భారత్ లోనూ విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను ఈ కథనంలో చూద్దాం.

డిస్‌ప్లే, ప్రాసెసర్

శాంసంగ్ గెలాక్సీ A18 4G ఫోన్.. 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ ఎగ్జినోస్ 1610 (Exynos 1610) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు.

సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లు

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9.0 (One UI 9.0) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుంది. ఈ ఫోన్ పై ఏకంగా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది. మరోవైపు ఈ ఫోన్ లో సరికొత్త ఏఐ టూల్స్ ను సైతం శాంసంగ్ అందిస్తోంది. ఫోన్‌లో గూగుల్ ‘సర్కిల్ టు సెర్చ్’, ‘జెమిని’ ఏఐ ఫీచర్లను అందుబాటులో ఉంచారు. ‘సర్కిల్ టు సెర్చ్’ ఫీచర్ ను ఉపయోగించుకొని స్క్రీన్‌పై ఉన్న ఏ వస్తువునైనా సర్కిల్ చేసి నేరుగా సెర్చ్ చేయవచ్చు. అలాగే జెమిని ద్వారా సాధారణ మాటలతోనే మెసేజ్‌లు పంపడం, క్యాలెండర్‌లో ఈవెంట్‌లను సేవ్ చేసుకోవడం వంటి పనులు సులభంగా చేయవచ్చు.

కెమెరా సెటప్

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనుక వైపు ట్రైపుల్ కెమెరా సెటప్ ను అందించారు. 50 MP ప్రైమరి కెమెరా, 5 MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్ ను ఫిక్స్ చేశారు. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. వెనుక కెమెరాతో ఫుల్ హెచ్ డీ వీడియోలను 30fps వద్ద, 120fps వద్ద HD స్లో-మోషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

బ్యాటరీ, కనెక్టివిటీ

Advertisement

ఈ ఫోన్‌లో 5,000mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని శాంసంగ్ వెల్లడించింది. అటు కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్, 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, NFC, టైప్-సి పోర్ట్‌లతో పాటు జీపీఎస్ సపోర్ట్ ను దీనికి అందించారు. చినుకులు, దుమ్ము – దూళి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్ కు IP64 రేటింగ్‌ అందించారు.

Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఇంతకీ ధర ఎంతంటే ?

ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్రాన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ తో దీన్ని తీసుకొచ్చారు. అక్కడ 279 యూరోలుగా మెుబైల్ ధరను శాంసంగ్ నిర్ణయించింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 30,900గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండటం గమనార్హం.

Also Read: ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

Tags

Related News

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

Big Stories

Advertisement
×