Telangana politics: తెలంగాణలో ఉప ఎన్నిక వేడి మొదలైందా? ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేశాయా? బైపోల్‌పై కసరత్తు మొదలుపెట్టేశాయా? ఓటర్ల నాడి పసిగట్టేందుకు సర్వేలు చేపడుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఓటర్ల నాడి ఎలా ఉంది?
రాజకీయల్లో ట్రెండ్ మారింది. ఇంటింటికి వెళ్లే సర్వే చేసే రోజులు క్రమంగా పోతున్నాయి. ఈ మధ్యకాలంలో IVRS సర్వేలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వాలు తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు కార్యకర్తల ద్వారా తెలుసుకుంటున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ఓటర్ల నాడి ఎటువైపు వుందో తెలుసుకునేందుకు సైతం ఆ తరహా సర్వేలు చేస్తాయి.
రేపో మాపో జూబ్లిహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో IVRS సర్వేలు మొదలయయాయి. వివిధ అంశాలపై ఆ సర్వే జరుగుతోంది. బైపోల్‌లో ఏ పార్టీకి మీరు సపోర్టు చేశారని ప్రశ్నిస్తున్నారు? కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ, రెండు బీఆర్ఎస్ పార్టీ, మూడు బీజేపీ అన్నది అసలు ప్రశ్న.
సర్వేని మళ్లీ వినాలనుకుంటే నాలుగు బటన్ నొక్కింది. IVRS సర్వేని ఎవరు జరిపిస్తున్నారో తెలియదు.. తెర వెనుక ఎవరున్నాన్నది తెలీదు. కాకపోతే 8985308447 నెంబర్ నుంచి ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి.
ALSO READ: మొన్న అమెరికా.. ఇప్పుడు లండన్, కేటీఆర్ సీక్రెట్ టూర్ కారణం అదేనా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 18 నెలలు గడిచిపోయింది. దగ్గరలో జమిలి ఎన్నికలు లేవు. దగ్గరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే కనిపిస్తోంది. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఆయా పార్టీలు తమ అభ్యర్థిని నిలపాలా లేదా అన్నది తెలుసుకోవడానికేనని అంటున్నారు. ఎందుకంటే.. గడిచిన పదేళ్లు భాగ్యనగరంలో కారు జెండా రెపరెపలాడింది.
అధికారం పోయిన తర్వాత నేతలు, కార్పొరేటర్లు వలస పోతున్నారు. పరిస్థితి గమనించిన ఓ రాజకీయ పార్టీ సర్వేకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. సర్వే ద్వారా బైపోల్ లో పోటీ చేయాలా? వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు సైతం ఉన్నాయి. దానికి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
ప్రజలు తమతో ఉన్నారని బలంగా చెబుతోంది అధికార పార్టీ. బీఆర్ఎస్ కూడా ప్రజలు తమ వైపు చూస్తున్నారని అంటున్నారు. బీజేపీ యాక్టివ్‌గా లేకపోయినా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ సర్వే జరగడం ఆసక్తిగా మారింది. సర్వేలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలీదుగానీ, ఇందులో వచ్చిన ఫలితాలు ఎన్నికల్లో రిపీట్ అవుతుందని చెప్పలేం కూడా. మనశ్శాంతి కోసం నేతలు సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.