Salman khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) 60 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే ఇప్పటికే ఈయన 10 మందికి పైగా హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నప్పటికీ.. ఏ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేదు. ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), సోమీ అలీ ఖాన్, సంగీత బిజ్లాని, కత్రినా కైఫ్ (Katrina Kaif) వంటి కొంతమంది హీరోయిన్లతో పెళ్లి వరకు వెళ్లారు. కానీ పెళ్లి చేసుకోలేదు.. అయితే ఇప్పటికే చాలాసార్లు పెళ్లి వార్తలపై సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇవి మాత్రం ఆగడం లేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ స్వయంగా స్పందించి తన పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.
అందుకే పెళ్లి చేసుకోలేదు – సల్మాన్ ఖాన్
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి అనేది భావోద్వేగమైన అంశాలతో కూడుకున్నటువంటిది. అలాగే పెళ్లి ఆర్థికపరంగా చాలా కఠినమైన అంశం. ఇలాంటి ఓ కఠినమైన సంబంధాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగించాలంటే.. అంత సులభమైన పనేం కాదు.. అందుకే పెళ్లి విషయంలో నా నిర్ణయం ఇలా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం నాకు 59 ఏళ్లు, 60 ఏళ్లకు చేరువవుతున్నా కూడా నాకు పెళ్లి చేసుకోవాలని లేదంటే దానికి కారణం ఇదే” అంటూ సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి స్పందించారు.
అలాంటి వ్యాధులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్..
అయితే ఇదే ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం సమస్యల గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నేను వృత్తిపరంగా ఎదుర్కొనే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. అయితే చిన్నప్పటినుండి ఈ అనారోగ్య సమస్యలు నాలో లేవు. ఒకవేళ ఉంటే వాటిని ఎప్పుడో ఎదుర్కొనే వాడిని. ఇక వృత్తిపరంగా నేను యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలా ఏవి మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజం, ట్రైజెమినల్ న్యూరాల్జియా వంటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాను. అయితే ఒక నటుడిగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.అలా అని వీటికి భయపడి సినిమా ఇండస్ట్రీలో కొనసాగకుండా ఉండలేను. ఎన్ని ఆటంకాలు వచ్చినా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూనే ఉంటాను.
జీవించి ఉన్నంతకాలం సినిమాలతోనే సావాసం..
అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు సినిమాలకు కాస్త విరామం ఇవ్వచ్చుగా అనుకుంటారు. కానీ నాకు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సినిమాలకు బ్రేక్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అందుకే జీవితాంతం ఎన్ని ఆటంకాలు వచ్చినా సినిమాల్లోనే ఉంటా అంటూ సల్మాన్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల గురించి, పెళ్లి గురించి తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు బీటౌన్ లో వైరల్ గా మారడంతో ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో మరొకసారి వైరల్ అవుతుంది.
ALSO READ Manisha Koirala: రజనీకాంత్ తో సినిమా.. కట్ చేస్తే.. కెరియర్ ఫట్!
సల్మాన్ ఖాన్ సినిమాలు..
ఇక సల్మాన్ ఖాన్ రీసెంట్ గా సికిందర్ (Sikinder) మూవీతో వచ్చారు.రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా ఏఆర్ మురుగదాస్ (A.R.Muragadas) డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.