E-Paper
Advertisement

Telangana Local Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు.. కేబినెట్‌ నిర్ణయంపై అందరి చూపు

Telangana Local Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు.. కేబినెట్‌ నిర్ణయంపై అందరి చూపు
Advertisement

Telangana Local Elections: తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈనెల 24వ తేదీలోపు తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు గత వారం ఇచ్చిన ఆదేశాల్లో, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల వివరాలు, తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Advertisement

కాగా ఈనెల 17న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల శాతం, ఎన్నికల తేదీలపై ప్రధాన చర్చ జరగనుంది. హైకోర్టు డెడ్‌లైన్ దృష్ట్యా ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.

ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖకు స్థానిక సంస్థల ఎన్నికలపై.. సమగ్ర నోట్ సిద్ధం చేయండి అని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి అవసరమైన లాజిస్టిక్స్‌, రిజర్వేషన్ల లెక్కలు, పరిపాలనా ఏర్పాట్లు, బడ్జెట్ వ్యయాలు మొదలైన అంశాలపై శాఖ పనిచేస్తోంది.
ముఖ్య కార్యదర్శి సానియా సింఘాల్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ అధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమక్షంలో సమావేశమై, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమీక్షించారు.

Advertisement

గత 20 నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన నిధులను నిలిపివేసింది. దీనికి కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, ఎన్నికైన స్థానిక సంస్థలే నిధులను వినియోగించగలవు. ఈ కారణంగా దాదాపు రూ.3,000 కోట్లకు పైగా నిధులు ప్రస్తుతం విడుదల కాకుండా నిలిచిపోయాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు పెద్ద ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించి, ఆ నిధులను తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తోంది.

Also Read: బయో-టెర్రర్ కుట్ర.. ఓ డాక్టర్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు.. భారీగా రిసిన్ సీజ్

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలనే నిర్ణయానికి రాబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు హైకోర్టు ఒత్తిడి, మరోవైపు కేంద్ర నిధుల నిలిపివేత కారణంగా ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఏర్పడింది. కేబినెట్ నిర్ణయం తరువాత, వచ్చే నెలలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×