Telangana women scheme: తెలంగాణలో మహిళల కోసం సరికొత్త ఆర్థిక పథకం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన మహాలక్ష్మి పథకంను కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్రంలోని 18 ఏళ్లు పైబడిన అన్ని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున నగదు పంపిణీ చేయాలనే ప్రతిపాదనపై ఈ నెల 25న నిర్వహించే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే అన్ని శాఖల కార్యదర్శులకు సంబంధిత నివేదికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.
❄ మహిళల ఆర్థిక స్వావలంబనకు నూతన దారి
ఈ పథకం అమలులో భాగంగా లక్షలాది మహిళలకు ప్రత్యక్షంగా ఆర్థిక భద్రత లభించనుంది. నెలకు రూ. 2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. ఇది మహిళలకు కేవలం సాయం మాత్రమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే గొప్ప ప్రయత్నంగా ప్రజలు భావిస్తున్నారు.
❄ అర్హతలు ఎలా ఉంటాయి?
ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం, ఈ పథకం ఇలా లబ్ధి లభించే అవకాశముంది.
☀ 18 సంవత్సరాలు దాటిన తెలంగాణలో నివాసముంటున్న మహిళలు
☀ ఆదాయ పరిమితి లేకుండా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా యోచన
☀ కుటుంబానికి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండటం తప్పనిసరి అయ్యే అవకాశం
☀ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి
☀ పథకం అమలులో నిర్ధిష్ట ఆధార్ అనుసంధానం అవసరం అయ్యే అవకాశముంది
☀ ఇవి అధికారికంగా ప్రకటించాల్సిన అంశాలే అయినా, ప్రాథమికంగా ఇలా ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
❄ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
జులై 25న జరగనున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ స్కీమ్ అమలుకు మార్గదర్శకంగా నిలవబోతోంది. ఇందులో పథకానికి సంబంధించి ఖర్చు, లబ్ధిదారుల గుర్తింపు, డిజిటల్ డ్రైవ్, లబ్ధిదారుల డేటా సేకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు, మహిళల పథకం మాత్రమే కాకుండా, BC రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
Also Read: Tirumala ticket booking: తిరుమల వెళుతున్నారా? ఇలా వెళ్లి అలా శ్రీవారి దర్శనం.. ఈ సౌకర్యం మీకోసమే!
❄ మహిళల్లో ఆశాభావం
ఈ స్కీమ్ గురించి వార్తలు రాగానే మహిళలలో విశేష ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెన్షన్ పథకం, గృహ నిర్మాణ పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, ఇది మరో పెద్ద తీపికబురు అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. సాధారణ మహిళల నుంచి కార్మికుల వరకు అన్నివర్గాల వారూ ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నెలకు వచ్చే ఈ ఆర్థిక తోడ్పాటు వారి జీవితాల్లో ఒక స్థిరమైన మార్పుకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
❄ మహాలక్ష్మి పథకం.. మహిళలకు నిజమైన గిఫ్ట్
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంను కేవలం ఒక రాజకీయ హామీగా కాకుండా, మహిళల సాధికారత కోసం తీసుకొచ్చే పునాది చర్యగా అభివర్ణిస్తోంది. ఇది వారిలో ఆర్థిక స్వావలంబనకు దారితీస్తుంది. ఇక ముందు నెల రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
మహిళలకు నెలకు రూ. 2,500 అంటే ఏడాదికి రూ. 30,000. ఇది చిన్న మొత్తం కాకపోయినా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం అమలు తీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నా, ప్రభుత్వం ముందడుగు వేసిందన్న అంశం మాత్రం స్పష్టమవుతోంది. తెలంగాణ మహిళల జీవితాల్లో కొత్త వెలుగు నింపే స్కీమ్‌గా ఇది నిలవనుందని ఆశిద్దాం.