BigTV English

People Fire on KTR : అధికారం పోయినా అహంకారం తగ్గలే..! చిన్నదొర వ్యాఖ్యలకు జనం కౌంటర్లు..

People Fire on KTR : అధికారం పోయినా అహంకారం తగ్గలే..! చిన్నదొర వ్యాఖ్యలకు జనం కౌంటర్లు..

People Fire on KTR: అధికారం పోయినా అహంకారం తగ్గలేదని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పంపిన నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాజకీయ కారణాలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తమిళిసై తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి తెలపారు.


గవర్నర్‌ను విమర్శించిన కేటీఆర్‌కు తెలంగాణ ప్రజలు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. గవర్నర్‌ను ఏనాడు పట్టించుకోని ప్రభుత్వం ఇవ్వాళ విమర్శలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాం లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని.. అలాంటి వారిని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంటే మింగుడుపడట్లేదని అంటున్నారు. కోదండరాం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే తొమ్మిదేళ్లలో గౌదవించకుండా అవమానపర్చారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు తెలంగాణ ప్రజలు. అహంకార ధోరణికి చమరగీతం పాడారని గవర్నర్ చెప్పడంతో కేటీఆర్ గవర్నర్‌పై అక్కసు వెల్లగట్టారన్నారు. ఓడిపోయినా కానీ ఇంకా అహంకారం తగ్గలేదని.. ఇలాగే ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.


Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×