E-Paper
Advertisement

ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆవిర్భావ వేడుకల్లో.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు!

ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆవిర్భావ వేడుకల్లో.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు!
Advertisement

Viksit Bharat: వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, వనరులు, ప్రతిభతో భాగస్వామి కావాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక..

హిమాలయాల ఒడిలోని ఉత్తరాఖండ్‌ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిందని, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలు దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉత్తరాఖండ్‌ ప్రజలు చేసిన పోరాటం, దేశ రక్షణలో గఢ్వాల్‌, కుమావోన్‌ రెజిమెంట్ల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జార్ఖండ్‌ గిరిజన సంస్కృతి, ఖనిజ సంపద, పారిశ్రామిక ప్రగతికి ప్రసిద్ధి చెందిందని గవర్నర్‌ అన్నారు. భగవాన్‌ బిర్సా ముండా గిరిజన హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కొమురం భీమ్‌ పోరాటం..

Advertisement

తెలంగాణ గిరిజన వీరుడు కొమురం భీమ్‌ పోరాటం కూడా ఇదే స్ఫూర్తిని చాటుతుందని అన్నారు. తెలంగాణ, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల మధ్య పర్యాటకం, వ్యవసాయం, గిరిజన సంక్షేమం, హస్తకళలు, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ సదుపాయాలు కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు భారతదేశానికి బలమని, వాటి మధ్య పరస్పర గౌరవం, సోదరభావం జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ సమాజంలో..

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ ప్రజలు తెలంగాణ సమాజంలో భాగస్వాములవుతూ మూడు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాల గవర్నర్ ల సందేశాలను డిజిటల్ స్క్రీన్ ల పై ప్రదర్శించారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే జుమా, గఢ్వాలి, సంతాలి, చోలియా నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Also read: సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

తెలంగాణ పోలీసులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రమోషన్లు!

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో దారుణం.. దొంగతనం జరిగినా కేసు నమోదు చేయని ఎస్సై!

ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హింస రాజ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు

సమ్మక్క సాగర్‌కు ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్, ఉత్తమ్ భేటీ

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ.. 72 ఏళ్ల వృద్ధురాలికి రూ.1.42 కోట్ల టోకరా

సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?

Big Stories

Advertisement
×