E-Paper
Advertisement

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?
Advertisement

Nagarjuna Sagar: తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారనే విమర్షలు వస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి జలదోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని భారీ టన్నెల్ తవ్వి నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారిని అధికారలు గుర్తించారు. ఈ విషయం పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారని అధికారలు అంటున్నారు.

టన్నెల్ నిర్మాణం..

నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు సమాచారం. అయితే విజయపురి సౌత్‌లో నాగార్జున సాగర్ డ్యామ్ కుడివైపు ముందు భాగంలో అమరజీవి జలపథకం పేరుతో భారీ సొరంగం నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్‌లో నీరు 510 అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నప్పటికీ, గ్రావిటీ ద్వారా నీటిని ఏపీకి తరలించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.పైకి మాత్రం తాగునీటి ప్రాజెక్టుగా చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారని నిపుణుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

160 మిలియన్ లీటర్ల సామర్థ్యం..

Advertisement

మొదటి దశలో సుమారు రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు తాగునీటిని అందించనున్న ఏపీ ప్రభుత్వం. నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం, మిగతా 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసి, ఇన్‌టేక్ వెల్ నుంచి నీటిని నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలించనున్న ఏపీ ప్రభుత్వం సిద్దమైతుందని సమాచారం.

Also Read: మార్కెట్లోకి వచ్చిన 6 నెలల్లోనే ఔట్.. పల్సర్ 180 మళ్లీ దొరకదా?

ఇంటెలిజెన్స్ నిఘా..

Advertisement

అక్కడి నుంచి ఒక్కొక్కటి 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపుల్లోకి, అనంతరం 200 ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపించుకుని, వీటన్నింటినీ అనుసంధానం చేసేందుకు 1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి, అవసరమైన చోట చిన్నచిన్న లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపోందిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, అనుమతి లేకుండా ఎవరినీ అటువైపు వెళ్లనివ్వకుండా, భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ఇంటెలిజెన్స్ నిఘాను ఏపీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఏపీ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

అధికారులు మౌనం..

ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నా తెలంగాణ బీజేపీ నాయకులు చోద్యం చూడడం ఇప్పుడు గమనార్హం. ఈ ప్రాజెక్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని, త్వరలో జరగనున్న కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్‌ఈ మల్లికార్జునరావు తెలిపారు. అయితే, ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో పనులు జరుగుతున్నా సాగర్ అధికారులు తమకు తెలియదని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ హెచ్చరిక..

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని, లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Also read: త్రిగుణ్ చేతిలో వంశీ కీలుబొమ్మా? ఇచ్చిపడేసిన చైత్ర!

Tags

Related News

పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్

మంచిర్యాలలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో మామూళ్ల మాఫియా.. అంతా ఆ ఇద్దరి చేతిలోనే..?

అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

స్ట్రాటజీనా..? అలకనా..? కొండా సురేఖ మౌనంపై కాంగ్రెస్‌లో చర్చ

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?

సిద్దిపేట నీ జాగీరా హరీష్ రావు?.. బరాబర్ వస్తాం, అడ్డుకో చూస్తాం – భవానీ రెడ్డి సవాల్

Big Stories

Advertisement
×