Khanapur SI: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కంత్రి ఎస్సై అరాచకం మితిమీరి పోయిందంటూ.. దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కేసులు నమోదు చేయకుండా మాపై వేధింపులకు గురిచేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ ఎస్సై రామ్మోహన్ పై తీవ్ర ఆరోపణలను అక్కడి స్థానికులు చేస్తున్నారు.
అయితే అక్టోబర్ 6న తన ఆవును ఎత్తుకెళ్లారని బాధితుడు వినోద్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ ఇచ్చాడు. దీంతో పోలీసుల స్పందన లేకపోవడంతో సీసీ కెమెరాల పరిశీలనతో స్వయంగా వాహనంను బాధితుడు గుర్తించాడు. దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారాలు ఎస్సైకి బాధితుడు అందించాడు. ఆధారాలు ఇచ్చినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాదితుడు వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ కేసులో వాహనాన్ని, అనుమానితున్ని స్టేషన్‌కు పిలిచి ఏడు రోజులుగా కాలయాపన చేశారు. అంతే కాకుండా నవంబర్ 15న మరోసారి పిటిషన్ ఇవ్వాలని బాధితుడికి సూచనలు చేశారు. దీంతో ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని చివరకు కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బయట మాట్లాడుకోండి అంటూ సలహా ఇస్తున్నట్టు భాదితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నిర్లక్ష్యంపై వెంటనే స్పందిచి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి గ్రామ స్థానికులు కోరుతున్నారు.
Also read: గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?