E-Paper
Advertisement

చట్టం మీ చేతుల్లో లేదు.. గోసంరక్షకులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

చట్టం మీ చేతుల్లో లేదు.. గోసంరక్షకులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Advertisement

Cow Protection: స్వేచ్ఛ బ్యూరో: అక్రమంగా తరలించే గోవులను రక్షించే బాధ్యత పోలీసులదని హైదరాబాద్ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ చెప్పారు. గోవులను తరలింపు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తప్పితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడుల వంటివి జరపొద్దని చెప్పారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన బంజారాహిల్స్​ లోని ఐసీసీసీలో వేర్వేరు గో రక్షక్​ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కమిషనరేట్​ సరిహద్దుల్లో చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గోరక్షకులు చట్టాన్ని పాటించాలన్నారు.

వారిపై క్రిమినల్​ కేసులు..

పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియ చేయాలని సూచించారు,. అలా కాకుండా పశువులను తరలిస్తున్న వారిపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశు వధకు సంబంధించి ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా, రెచ్చగొట్టేలా, ఉద్రిక్త పెంచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని చెప్పారు. అలా చేసిన వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గో రక్షక్​ ప్రతినిధులు పోలీసులతో కలిసి చెక్​ పోస్టుల వద్దకు వెళ్ల వద్దని చెప్పారు. ఫోటోలు తీయటం, నిందితుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయటం వంటివి చేయవద్దన్నారు. సమన్వయం కోసం ప్రతీ గో రక్షక్​ సంఘం ఒక ప్రతినిధి ఫోన్​ నెంబర్​ ను పోలీసులకు అందచేయాలని సూచించారు.

Advertisement

Also read: తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

కేవలం పండుగ సమయంలోనే..

వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను ధరించాలన్నారు. తనిఖీల పేర గో రక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులను పెట్టుకోవద్దని చెప్పారు. పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించటం, దారిలో అడ్డంకులు సృష్టించటం వంటివి చేయవద్దని చెప్పారు. కేవలం పండుగ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా పశు వైద్యుల ధృవీకరణ లేకుండా జరిగే పశువుల అక్రమ రవాణాపై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా 8712661000 నెంబర్​ కు తెలియ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు తఫ్సీర్​ ఇక్భాల్​, ఎం.శ్రీనివాసులు, జాయింట్​ సీపీ శ్వేత, యుగ తులసీ ఫౌండేషన్ ఛైర్మన్ కొలిశెట్టి శివకుమార్​, గో రక్షక్​ దళ్​ ప్రతినిధి దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: రూ.50వేల జీతంతో విజయవాడలో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే భయ్యా, పూర్తి వివరాలివే

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×