BigTV English

Manchu Lakshmi: ఆస్తి వివాదాలపై ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన మంచు లక్ష్మీ..ఇకనైనా.?

Manchu Lakshmi: ఆస్తి వివాదాలపై ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిన మంచు లక్ష్మీ..ఇకనైనా.?

Manchu Lakshmi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ(Manchu Family). క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా మోహన్ బాబు(Mohan Babu) తాను సంపాదించిన ఆస్తులలో బిడ్డలకు పంచడంలో వ్యత్యాసం చూపించాడనే నేపథ్యంలోనే ఈ గొడవలు తలెత్తాయని సమాచారం. ముఖ్యంగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi), మంచు విష్ణు (Manchu Lakshmi) లకు అధికంగా ఆస్తులు రాసిచ్చిన మోహన్ బాబు చిన్న కొడుకు అయినా మంచు మనోజ్ (Manchu Manoj) కు కేవలం ఒక ఫ్లాట్ ఇవ్వడంతోనే ఈ గొడవలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నా.. మనోజ్ వివాహం తర్వాతే ఈ గొడవలను బహిర్గతం చేశారని సమాచారం.


ఒక పోస్ట్ తో గొడవలకు చెక్ పెట్టిన మంచు లక్ష్మి..

ఇదిలా ఉండగా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండడంతో మంచు లక్ష్మీ ఒక్క పోస్టుతో గొడవలకు పుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మి తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకుంది.” నేను దేనిని అడగకూడదు.. ఇకపై నేను ఏది నా కోసం కోరుకోను.. నేను చెప్పే ఈ మాట దేనినైనా ఆపడానికి సరైన కారణం అవచ్చు” అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంతో అందరూ మంచు ఫ్యామిలీలో గొడవలపై ఇలా చెక్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇకపై తండ్రి నుంచి ఎటువంటి ఆస్తులు అడగనని, కనీసం ఈ నిర్ణయం మంచు కుటుంబంలో వస్తున్న గొడవలను ఆపుతుందేమో అనే అభిప్రాయంతోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.


జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..

ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu)భార్య బిడ్డలతో దుబాయిలో సెటిల్ అవ్వగా.. అటు మంచు లక్ష్మీ (Manchu Lakshmi)కూడా ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటిలోనే భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని, మంచు మనోజ్ గొడవపడగా మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారు. ఇక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు కొడుకులిద్దరి తరఫున 70 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో అటు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చారు. దీంతో ఈ విషయాలు భారీగా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల రాచకొండ పోలీసులు వీరిని విచారణకు రావాలని పిలవగా.. మోహన్ బాబు అస్వస్థత కారణంగా వెళ్లలేకపోయారు. మరొకవైపు మంచు మనోజ్ కూడా చిన్న పాప ఉందని సమస్యలు సద్దుమణిగాక వస్తానని తెలిపారు. ఇక తర్వాత రాచకొండ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లక్ష బాండ్ ఇచ్చి తనంతట తాను గొడవలకు వెళ్ళనని చెప్పాడు. అలాగే మంచు విష్ణు కి కూడా రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×