BigTV English

Telangana Politics : బండి సంజయ్‌కు రోహిత్ రెడ్డి సవాల్..

Telangana Politics : బండి సంజయ్‌కు రోహిత్ రెడ్డి సవాల్..

Telangana Politics : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి సంజయ్ చేసిన వాఖ్యలను ఖండించారు. డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేసి చెప్పారు. బండి సంజయ్ కు 24 గంటలు సమయం ఇస్తున్నామని.. ఆలోపు తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు.


ఇకపోతే.. ఈడీ అధికారులు తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. బండి సంజయ్ తన గురించి వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే.. ఈడీ సమన్లు వచ్చాయన్న రోహిత్ రెడ్డి.. బండి సంజయ్ కి ఏమైనా భవిష్యవాణి తెలుసా అంటూ మండిపడ్డారు. ఈడి తనకు నోటీసు ఇచ్చే విషయం బండి సంజయ్ కు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించారు. దేశంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు దుర్వినియోగానికి గురవుతున్నాయని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను తాను అడ్డుకున్నందుకే.. తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు రోహిత్ రెడ్డి.

మరోవైపు తనకు ఎలాంటి కేసులతో సంబంధం లేదన్న రోహిత్ రెడ్డి.. తనకు ఈడి నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈడీ నోటీసులు ఇచ్చినా, సీబీఐ ఎంక్వయిరీలు చేసినా తగ్గేది లేదని.. భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరంగా సమాధానం ఇస్తానని చెప్పారు. ఇక తనపై రకరకాల ఆరోపణలు చేసిన బండి సంజయ్ కు సవాల్ విసిరిన రోహిత్ రెడ్డి.. యాదగిరిగుట్టకు తాను తడిబట్టలతో రావడానికి.. ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. బండి సంజయ్ ఎప్పుడు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఎటువంటి కేసులతో సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు పైలెట్ రోహిత్ రెడ్డి.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×