Big Stories

Prevent Heart Risks : మీ గుండె ఆగిపోనుంది… జాగ్రత్తపడండి! ముందే హెచ్చరించే టూల్

Prevent Heart Risks:హార్ట్ ఎటాక్స్ పెరిగిపోతున్నాయి. గుండెకు ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. అయితే దీన్ని పసిగట్టి ముందుగానే హెచ్చరిస్తే… మనిషి బతికే అవకాశాలే ఎక్కువ అంటారు వైద్యులు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో ఇజ్రాయెల్ సైంటిస్టులు ఒక టూల్ ని రూపొందించారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత టూల్. ఈసీజీ టెస్టును విశ్లేషించి గుండె ఆగిపోయే ముప్పును ఇది ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. సాధారణంగా గుండె పోటు వచ్చినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. ఏమాత్రం ఆలస్యమైనా అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ గా పిలుస్తుంటారు. ఇజ్రాయెల్ సైంటిస్టులు తయారు చేసిన ఈ పరికరాన్ని నీడ్ ఆఫ్ ద అవర్ టూల్ గా పిలుస్తున్నారు. ఇక మైయోసైటిస్ బాధితులకు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం మైయోసైటిస్ బాధితుల కోసం కొత్తగా రూపొందించిన పరికరాన్ని వినియోగిస్తున్నారు. 2000వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం మధ్య 89 మంది మైయోసైటిస్ బాధితుల ఈసీజీ రిపోర్టులు, మెడికల్ రికార్డులను పొందుపర్చి ఏఐ సాంకేతికతను రూపొందించినట్లు సైంటిస్టులు తెలిపారు.
ఈ ఏఐ టూల్ ఇంకా ప్రయోగదశలోనే ఉంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందంటారు శాస్త్రవేత్తలు.
గుండె పోటు పెద్దవాళ్లలో మాత్రమే వస్తుందని ఇన్నాళ్లు అనుకునేవారు. కానీ ఇప్పుడది యువతీయువకులతోపాటు పిల్లల్లోనూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్ లోని భిండ్ లో నాలుగో తరగతి విద్యార్థి గుండెపోటుతో స్కూలు బస్సులోనే కుప్పకూలిపోయాడు. ఇక ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ బాలుడు క్రికెట్ ఆడుతూ ఆకస్మికంగా మరణించాడు. అటు ఓ వ్యక్తి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వివాహ వేడుకలో ఓ యువతి సడెన్ గా చనిపోయింది. వీటన్నింటికీ కారణం గుండె పోటే అని తేలింది. అందుకే హార్ట్ ఎటాక్ ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటివారిలో హార్ట్ బీట్ ని పసిగట్టి హెచ్చరించే స్మార్ట్ వాచ్ లు, ఇతర స్మార్ట్ పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

=========
మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో నాలుగో తరగతి చదువుతున్న 12 ఏండ్ల బాలుడు శనివారం స్కూల్‌ బస్సులోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే దవాఖానకు తరలించగా.. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోనే ఓ బాలుడు క్రికెట్‌ ఆడుతూ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలి మరణించాడు. లక్నోలోనూ పెండ్లివేడుకలో ఓ యువతి ఉన్నట్టుండి మరణించారు. దేశంలో ఇటీవల ఇలాంటి మరణాలు పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు, యువకులు కూడా గుండెపోటుకు గురికావడం కలవరపరుస్తున్నది. ఈ ఆకస్మిక మరణాలపై దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏదైనా ఏర్పాటుచేశారా? అని కేంద్రం, ఢిల్లీ సర్కారుకు ఇటీవలే ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీచేసింది.

- Advertisement -

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 16: యువ గుండె చెదురుతున్నది. అకస్మాత్తుగా ఆగిపోతున్నది. ధృడంగా ఉన్న వారి శరీరాలను సైతం క్షణాల్లో కూల్చేస్తున్నది. దేశంలో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న యువత సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఒకప్పుడు గుండెపోట్లు అంటే 60-70 వయసులవారికే అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ముప్పు యువతను, చిన్నారులను చుట్టుముడుతున్నది. ఆరోగ్యంగా ఉన్న యువత, మధ్యవయస్కులు గుండెపోటుకు గురవుతున్న కేసులు పెరుగుతున్నాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో తేలింది. కరోనా టీకా తీసుకున్న వారిలో, తీసుకోని వారిలోనూ ఈ సమస్య ఉన్నదని పేర్కొన్నది.

కారణాలు ఏంటి?

గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే నాళాల్లో హఠాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండెపోటు అంటారు. గుండెకు రక్తం, ఆక్సిజన్‌ సరిగా అందకపోతే పంపింగ్‌ చేయలేదు. ఎంత ఎక్కువసేపు అడ్డంకి ఏర్పడితే గుండెకు అంత నష్టం జరుగుతుంది. పురుషుల్లో ఇలాంటి గుండెపోట్లు 65 ఏండ్లకు, మహిళల్లో 72 ఏండ్లకు వస్తాయనేది పాత లెక్క. కానీ ఇటీవలి కాలంలో ఆ వయసు క్రమంగా కిందకు పడిపోతూ వస్తున్నది. మద్యం, ఇతర మత్తుపదార్థాలు సేవించడం, పొగతాగడం దీనికి కారణమని అంటున్నారు. అయితే కేవలం ఈ రెండు అంశాలే గుండెపోట్లకు కారణం కాదు. ఊబకాయం, మధుమేహం, అధికకొవ్వు, కుటుంబ చరిత్ర కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. గుండెపోటు హఠాత్తుగా ఏమీ రాదు. ముందస్తు లక్షణాల్లో ఛాతీలో నొప్పి, ఊపిరి సరిగా ఆడకపోవడం, తీవ్రమైన అలసట, భుజాలు, చేతులు, దవడల్లో నొప్పి, తలతిరగడం, వాంతి కావడం వంటివి గుండెపోటు సంకేతాలు. అయితే మగవారిలో కన్నా ఆడవారిలో ఈ లక్షణాలు కనిపించడం తక్కువ. ఇవి మగవారిలో మాత్రం ఒక్కసారిగా విరుచుకుపడ్డట్టు కనిపిస్తాయి. ఆడవారిలో తక్కువ తీవ్రతతో కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News