Telangana Poll Expenditure : తెలంగాణ ఎన్నికలలో భారీ ధన ప్రవాహం.. మితిమీరుతున్న ఖర్చు!

Telangana Poll Expenditure : తెలంగాణ ఎన్నికలలో భారీ ధన ప్రవాహం.. మితిమీరుతున్న ఖర్చు!

Share this post with your friends

Telangana Poll Expenditure : తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం భారీ స్థాయిలో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ప్రచారం కోసం ర్యాలీలు సభల, సమావేశాలు, కార్యకర్తల కోసం పెట్టే ఖర్చు అంతాఇంతా కాదు.

ఇవి కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెట్టే ఖర్చు పెద్ద ఎత్తులో ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఒక్కో ఓటరు కోసం అక్కడ పోటీ స్థాయిని బట్టి మటన్, మందు, చికెన్, నగదు పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలు ప్లానింగ్ చేస్తున్నాయి.

అలాగే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ భారీ ఖర్చుతో బహిరంగ సభలో నిర్వహిస్తున్నాయి. ఇలా ఒక్కో సభకు సగటున రూ.3.5కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సభలకు జనాలను తరలించడం, వారికోసం వాహనాలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన ఒక్కో మనిషికి రూ.500 వరకు ఇస్తున్నారు. ఒక ప్రధాన పార్టీ అయితే సుమారు 50 పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించింది.

ఈ సభలకోసం పార్టీ ఫండ్ నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని అంచనా. ఆ పార్టీ అయితే ప్రధాన కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు పంపిణీ చేసి ఆయా నియోజకవర్గాల్లో పండుగలకు ప్రజలకోసం మటన్, చికెన్‌లతో విందు ఏర్పాటు చేస్తోందట. రెండేళ్ల క్రితం హుజూరాబద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చారని సమాచారం. ఇప్పుడు కూడా పోటీ స్థాయిని బట్టి ఒక్కో నియోజకవర్గంలో రూ.1000, రూ.2,000 – రూ.4000 వరకు పంపిణీ చేయబోతున్నట్లు వార్తలందుతున్నాయి. ఈ ఎన్నికల ఖర్చు చూస్తే.. దేశంలోనే ఇప్పటివరకు జరిగిన రాష్ట్ర ఎన్నికలలో తెలంగాణ ఎన్నికల ఖర్చు ఒక రికార్డ్ అవుతుంది.

ఎన్నికల కమీషన్ నిఘా!

ఇంత భారీ స్థాయిలో డబ్బు పంపిణీ జరుగుతోందని తెలియడంతో ఎన్నికల సంఘం అధికారులు కూడా సన్నధమయ్యారు. బ్యాంకులను సంప్రదించి.. నగదు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వ్యక్తిగత అకౌంట్లపై నిత్యం నిఘా వేసి, ఎక్కువ మొత్తంలో బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసినట్లు తెలిస్తే ఆ ఖాతాదారులను అప్పుడే పిలిచి విచారణ చేస్తున్నారు. కానీ ఎన్ని చర్యలు చేపట్టి ఏం లాభం.. చాలా గ్రామాలకు అప్పుడే భారీ మొత్తంలో నగదు చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ ప్రధాన పార్టీ అయితే ఎన్నికల షెడ్యూలుకు ముందే నమ్మకస్తులైన కార్యకర్తలకు పెద్ద మొత్తంలో డబ్బు చేరవేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో నుంచి ఏ నాయకుడికి ఎంత అప్పగించాలి, ఎలా ఓటర్లకు పంపిణీ చేయాలనే అంశాలపై కూడా పక్కా ప్లానింగ్ ఉందట. ప్రధాన పార్టీ ముందు జాగ్రత్తగా తన అభ్యర్థులకు ఎలాంటి ఆర్థికంగా సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుందట.

112 నియోజకవర్గాలలో దాదాపు రూ.5 వేల కోట్ల నగదును అభ్యర్థుల చేతికి అందుతుందని చర్చ జరుగుతోంది. సగటును ఒక్కో నియోజకవర్గంపై రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు పథకం వేసినట్లు సమాచారం. ఒకవేళ ఎక్కడైనా గట్టి పోటీ ఉంటే అదనంగా మరో రూ.20 కోట్లను ఖర్చు చేయాలని ప్రధాన పార్టీ అభ్యర్థులు భావిస్తున్నట్లు టాక్!


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Michaung Landfall: మిగ్ జాం తుపాన్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Bigtv Digital

Atakaram : C/O Aటకారం

Bigtv Digital

Cyclone Michaung: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్షసూచన

Bigtv Digital

Congress: ‘బలగం’.. మనం మనం కాంగ్రెస్ కుటుంబం.. శ్రేణులకు స్ట్రాంగ్ మెసేజ్..

Bigtv Digital

Chandrababu Latest News : రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ.. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు..

Bigtv Digital

Stock Market: మార్కెట్లో బ్లడ్ బాత్.. అదానీ షేర్లు మళ్లీ ఢమాల్..

Bigtv Digital

Leave a Comment