Palestine : హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనా గుర్తింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 15 నవంబర్ 1988న పాలస్తీనా దేశం ఆవిర్భవించినట్టు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్‌వో) సంకీర్ణ సర్కారు ప్రకటించింది.
గాజాస్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం పాలస్తీనా పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల్లో 138 దేశాలు(72%) ఇప్పటి వరకు పాలస్తీనాను గుర్తించాయి.
మరో 55 దేశాలు గుర్తించలేదు. జీ7 దేశాల కూటమి సహా పశ్చిమ దేశాలు వీటిలో ఉన్నాయి. అయితే అనధికారిక దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
ఆర్థికంగా పురోగమిస్తున్న బ్రిక్స్, జీ-20 దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. అర్జెంటీనా, ఇండొనేసియా, తుర్కియే, సౌదీఅరేబియా వీటిలో కొన్ని.
2012లో పాలస్తీనా హోదాను ఐక్యరాజ్యసమితి పెంచింది. నాన్-మెంబర్ అబ్జర్వర్ దేశంగా అప్‌గ్రేడ్ చేసింది. వాటికన్‌కు ఇలాంటి హోదా ఉంది. నవంబర్ నాటికి ఐరాస సభ్యదేశాల్లో 72% పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించగా.. ఇజ్రాయెల్ 84% సభ్యదేశాల గుర్తింపు పొందింది.