
Salaar Movie Updates : డార్లింగ్ ఫాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రికార్డ్ సృష్టిస్తుంది అని ప్రభాస్ అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చిత్ర బృందం బాగా లేటుగా మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ మార్కెట్ పై ప్రభాస్, ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే ఆస్కారం ఈ చిత్రానికి ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆ రెంజ్ హిట్ ఇంతవరకు పడలేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ మూవీతో హిట్ కొట్టాలి అని ప్రభాస్ కూడా గట్టి పట్టుదల మీదే ఉన్నాడు. పైగా ఈ చిత్రం కావాలసినంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. లేటెస్ట్ గా మూవీ నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ దీనిపై అంచనాలను మరింత పెంచే లాగా ఉంది.
ఇక లేటెస్ట్ గా మూవీ గురించి వైరల్ అవుతున్న గాసిప్ కరెక్ట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు కనివిని ఎరుగని ఓపెనింగ్ అందడం కన్ఫామ్. సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. లోకేష్ కనకరాజ్ టైపులో తన సినిమాలతో సరికొత్త మల్టీవర్ సృష్టించబోతున్నాడు అన్న టాక్ ఇప్పటికే ఉంది. ఇప్పటివరకు విడుదలైన మూవీ పోస్టర్లను జాగ్రత్తగా డీకోడ్ చేస్తే తప్పకుండా కేజీఎఫ్ బంగారు ప్రపంచానికి.. సలార్ లింక్ అయి ఉందేమో అన్న అనుమానం కలుగక మానదు.
అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు డైరెక్టర్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ మాత్రం కచ్చితంగా సలార్ కు కేజీఎఫ్ కు రిలేషన్ ఉందనే చెబుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే.. ప్రభాస్ సలార్ మూవీలు కేజీఎఫ్ స్టార్ కనిపిస్తాడని టాక్. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే షారుఖ్ ఖాన్ డుంకి సినిమా ప్రభావం బాలీవుడ్ లో కూడా సలార్ పై అస్సలు పడదు. కేజీఎఫ్ సెకండ్ పార్ట్ పుణ్యమా అని యష్ కు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది తేలాల్సి ఉంది.