E-Paper
Advertisement

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. వారి డిమాండ్లివే..!

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. వారి డిమాండ్లివే..!
Advertisement

Artisans Strike: స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ ఆర్టీజన్లు సమ్మె సైరన్ మోగించనున్నారు. ఈనెల 8న జెన్కో, ట్రాన్స్ కో, డిస్కంలలో నిరవధిక సమ్మెకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు, నిరవధిక సమ్మెకు తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఇప్పటికే మార్చి 26, 30న అన్ని ఆపరేషనల్ డివిజన్ కార్యాలయాల ఎదుట వారు ధర్నాకు దిగారు. కాగా గురువారం అన్ని ఆపరేషనల్ సర్కిల్ కార్యాలయాల వద్ద వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.

జాయింట్ యాక్షన్ కమిటీ..

అలాగే ఈనెల 4న పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆపై ఏప్రిల్ 7న హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట మహా ధర్నాకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఆ మరుసటి రోజే ఈనెల 8న ఉదయం 9 గంటల నుంచి విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో నిరవధిక సమ్మె నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. కాగా ఇప్పటికే ఈ సమ్మె నోటీసును ఇంధన శాఖ మంత్రికి, విద్యుత్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు సమర్పించినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: నన్ను ఉరితీయండి కానీ.. సీఎంకు పాడి కౌశిక్ రెడ్డి భావోద్వేగ సవాల్!

విద్యార్హతల ఆధారంగా..

2017లో ఆర్టీజన్ల గుర్తింపు ప్రక్రియ జరిగినప్పటికీ, కోర్టు కేసులు, ఇతర పరిపాలనాపరమైన కారణాల వల్ల తమకు రావాల్సిన రిస్క్ బెనిఫిట్స్, సరైన సర్వీస్ రూల్స్ అందడం లేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా యాజమాన్యం స్పందించకపోవడంతోనే ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్టీజన్ల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పోరును ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టీజన్ ఉద్యోగుల కేటగిరీ మార్చడంతో పాటు పాత సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని పట్టుపడుతున్నారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లోని అన్-మ్యాన్డ్ వర్కర్లను ఆర్టీజన్లుగా గుర్తించాలనే డిమాండ్ తో తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు దిగనుంది.

ప్రధాన డిమాండ్లు ఇవే..

Advertisement

తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానంగా ఆరు డిమాండ్లను పరిష్​కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే సమ్మెను విరమిస్తామని స్పష్టంచేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించింది.
* 4 డిసెంబర్ 2016 కంటే ముందు నుంచి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి.
* పీస్ రేట్ వర్కర్లకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి.
* 2026 పీఆర్సీ అమలుచేయాలి.
* విద్యార్హతను బట్టి ఆర్టీజన్ కార్మిలందరినీ కన్వర్షన్ చేయాలి.
* ఆర్టీజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలుచేయాలి.
* డిస్కంలలోని అన్ మ్యాన్డ్ వర్కర్స్ ను సంస్థలో విలీనం చేసుకోవాలి.

Also Read: అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×