E-Paper
Advertisement

చంచల్‌గూడ టు చర్లపల్లి.. జైళ్లలో ఖైదీలకు ఊరటనిచ్చే ‘ఉల్లాసం’ షురూ!

చంచల్‌గూడ టు చర్లపల్లి.. జైళ్లలో ఖైదీలకు ఊరటనిచ్చే ‘ఉల్లాసం’ షురూ!
Advertisement

Ullasam Programme: ఖైదీల సంస్కరణ, సంక్షేమం కోసం పలు చర్యలు అమలు చేస్తున్న తెలంగాణ జైళ్ల శాఖ.. తాజాగా ‘ఉల్లాసం’ పేర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, స్వీయహాని ప్రవర్తన, ఆత్మహత్యా ధోరణులను తగ్గించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అదే సమయంలో ఆనందం, సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించారు. సోమవారం ఉల్లాసం కార్యక్రమాన్ని చంచల్​ గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ప్రారంభించారు.

అనంతరం జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు ఖైదీల్లో ఒత్తిడిని తగ్గించటానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. ఖైదీలలో మానసిక ఆందోళన, ప్రతికూల ఆలోచనలు, ఆత్మహత్యా ప్రవృత్తులను తగ్గించడంతో పాటు వారి శక్తిని సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించి జైళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఖైదీల కోసం వివిధ ఇండోర్, అవుట్ డోర్ వినోద, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పురుష ఖైదీల కోసం వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, ఇతర బోర్డు గేమ్స్ నిర్వహిస్తున్నారు.

Advertisement

Also Read: కొండపై మ్యాగీ అమ్ముతూ నెలకు రూ.4.5 లక్షలు.. ఈ వ్యాపారి సంపాదన మామూలుగా లేదుగా!

మహిళా ఖైదీల కోసం పజిల్ గేమ్స్, మ్యూజికల్ చైర్స్, నిమ్మకాయతో స్పూన్ రేస్, బెలూన్ గేమ్, రన్నింగ్ రేస్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తోపాటు ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖైదీల వయస్సు, శారీరక స్థితి, వ్యక్తిగత సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతి ఖైదీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా క్రీడల్లో పాల్గొనేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఖైదీల ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొంటూ జట్టు స్ఫూర్తి, సమన్వయం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఉల్లాసం కార్యక్రమాన్ని త్వరలోనే చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ తరువాత క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలోని ఖైదీలను కూడా దీంట్లో భాగస్వాములుగా చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది.

Advertisement

Also Read: ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!

Tags

Related News

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

అప్పులు తీర్చేందుకు చెయిన్ స్నాచింగ్.. బైక్ మెకానిక్ అరెస్ట్!

అమిత్ షా సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో బియ్యం కొరత.. ధరలు పెంచిన వారిపై 11 కేసులు నమోదు!

హోంమంత్రివా.. లేక గల్లీ మంత్రివా.. అమిత్ షా పై మంత్రి పోన్నం ఫైర్!

జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో సైబర్ దందా కలకలం!

క్రిటికల్ ఐసీయూలో బీజేపీ పార్టీ.. అమిత్ షా వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్!

Big Stories

Advertisement
×