E-Paper
Advertisement

జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో సైబర్ దందా కలకలం!

జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో సైబర్ దందా కలకలం!
Advertisement

Fake WhatsApp: జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు కోరుతున్న సందేశాలను నమ్మవద్దని, ఎవరూ డబ్బులు పంపి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ పేరు,ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, ఆయన పేరుతో ముఖ్యంగా 8974808916 నంబర్‌తో ప్రజలకు సందేశాలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.

వాట్సాప్‌లో..

తన పేరుతో డబ్బులు కోరుతూ వచ్చే ఇటువంటి సందేశాలు పూర్తిగా నకిలీవని, వాటిని ఎవరూ నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టం చేశారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు వెల్లడించారు. వాట్సాప్‌లో లేదా సోషల్ మీడియాలో కలెక్టర్ ప్రభుత్వ అధికారుల ఫొటోలు,పేర్లు, హోదాలు కనిపించినంత మాత్రాన అవి నిజమైన ఖాతాలని నమ్మవద్దని తెలిపారు.

చట్టప్రకారం కఠిన చర్యలు..

Advertisement

ప్రభుత్వ అధికారులు,జిల్లా కలెక్టర్ పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని,ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ లేదా ఇతర అధికారుల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఎవరూ మోసపోవద్దని,ఇలాంటి నకిలీ ఖాతాలు లేదా సందేశాలు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: కిచెన్ కత్తులు మెుద్దుబారాయా? ఇంట్లోని వస్తువులతో.. పదును పెట్టే మ్యాజిక్ ట్రిక్స్!

Tags

Related News

హోంమంత్రివా.. లేక గల్లీ మంత్రివా.. అమిత్ షా పై మంత్రి పోన్నం ఫైర్!

చంచల్‌గూడ టు చర్లపల్లి.. జైళ్లలో ఖైదీలకు ఊరటనిచ్చే ‘ఉల్లాసం’ షురూ!

క్రిటికల్ ఐసీయూలో బీజేపీ పార్టీ.. అమిత్ షా వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్!

చిరు, ఎన్టీఆర్ నుంచి తేజ సజ్జ వరకు.. అమిత్ షా భేటీల వెనుక అసలు వ్యూహమేంటి?

హైదరాబాద్ పాదయాత్రలో అమిత్ షా సంచలనం.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రశ్నల వర్షం!

నగరంలో చెత్త కనిపిస్తే ఉద్యోగాలు గోవిందా! అధికారులకు సీఎం రేవంత్ రఫ్ ఆడిచ్చే హెచ్చరిక!

జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన.. దత్తత చిన్నారి వీడియో వైరల్!

Big Stories

Advertisement
×