E-Paper
Advertisement

ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!

ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!
Advertisement

Rohit Naidu: రోహిత్ నాయుడు పట్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగిపోతుంది. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10 Telugu) కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రోహిత్ ఎనిమిది వారాలపాటు హౌస్ లో కొనసాగారు. ఇలా ఈయన 8 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ రోహిత్ అని ఈసారి కూడా బిగ్ బాస్ కప్ కామనర్ చేతిలో ఉండబోతుందని ఎంతోమంది భావించారు. అయితే ఊహించని విధంగా రోహిత్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది.

రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్..

రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ పంపించి ఇలా ఎలిమినేట్ అంటూ టిఆర్పి స్టంట్ వేస్తున్నారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం నిజంగానే హౌస్ నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని, కచ్చితంగా రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రోహిత్ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ టీం పై, నాగార్జునపై కూడా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేనల్లుడితో రోహిత్ నాయుడు..

Advertisement

ఇలా రోహిత్ ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచారు. అయితే ఈయన మాత్రం ఇప్పటివరకు ఎలిమినేషన్ గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక బిగ్ బాస్ నుంచి నేరుగా బజ్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ అనంతరం ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. అయితే ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటిసారి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు. తన మేనల్లుడిని(Nephew) ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసిన రోహిత్ నా మేనల్లుడితో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈయన తన మేనల్లుడుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఎవరి దిష్టి తగలకూడదు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు సీక్రెట్ రూమ్ లోనే ఉన్నావు అది ఏఐ ఫోటో అంటూ ఇప్పటికీ ఈయన ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేక ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రోహిత్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఫ్యామిలీతో తన హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. మరి బిగ్ బాస్ ఎలిమినేషన్ పై రోహిత్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?

Related News

రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!

ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం.. దెబ్బకు రంగంలోకి పేరెంట్స్.. కట్ చేస్తే!

నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!

ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమా.. హీటెక్కిన నామినేషన్ వార్!

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!

Big Stories

Advertisement
×