Ponnam Prabhakar: కాంగ్రెస్ ను విమర్శించడానికి మాత్రమే అమిత్ షా పర్యటన పరిమితం చేసుకున్నారని మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ విభజన హామీలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై మీరు విమర్శించిన తీరుపై కూడా స్పందిస్తారని అనుకున్నానన కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము అధికారంలోకి రావాలని చెప్తున్నారని అన్నారు. చొరబాటు దారులకు ఓటు హక్కు మేము వ్యతిరేకం. కేంద్ర హోం శాఖ మంత్రిగా మీరే ఉన్నారు.. ఎందుకు చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించే విధంగా అవకాశం కలిగింది దానిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని పోన్నం ప్రభాకర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలగించిన ఓట్లపై ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ల తొలగించడం పై మాత్రమే ప్రశ్నిస్తుందని, గతంలో brs ఉన్నప్పుడు కూడా మీరు ఏటీఎం అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడుతున్నారని, దేశంలో మోడీ అమిత్ షా టాక్స్ నడుస్తుంది.. ముగ్గురు గుజరాత్‌ల కోసం మాత్రమే దేశ ప్రధానమంత్రిగా హోం మంత్రిగా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ హామీల గురించి ఒక్కొకటిగా బహిరంగ చర్చకు మీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమా..? కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఏ గడపకు వెళ్లినా సన్న బియ్యం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్, ఉద్యోగ నియామకాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం మాదని అన్నారు.
మా దగ్గర నుండి కేంద్రానికి వెళ్తున్న టాక్స్ ఎంత.. తెలంగాణకి మీరు తిరిగి ఇస్తున్నది ఎంత..? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధాని నిరంకుశ వైఖరికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడుతున్నామో మీరు కూడా తప్ప కుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ర్యాలీ తీయడాన్ని తప్పకుండా మంచిదేనిని ఏద్దేవా వేశారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం.. అరాచకత్వం నశించాలని కోరుతున్నాం ప్రతిపక్షంలో ఉన్నవారు అరాచకత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే అవకాశం లేదని అన్నారు. 12 ఏళ్లుగా పరిపాలిస్తున్న మీరే ఈ పరిస్థితికి కారకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
Also Read: ఓట్ల గల్లంతుపై యోగి సంచలన వ్యాఖ్యలు.. ఇరకాటంలో పడ్డ కేంద్రం, సిఈసి!
మీ హైదరాబాద్ పర్యటన ఎంత ఫెయిల్ అయిందో మీకు తెలుసు అది మీ స్థానిక నాయకత్వం రాసిన స్క్రిప్ట్.. ఇప్పటికైనా తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో ఉన్న కరువుపై కేంద్రం నుండి సహాయం చేయాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీ నీ కౌంటర్ చేయడానికి ఢిల్లీలో ధైర్యం లేక కేవలం హైదరాబాద్ వచ్చారని అన్నారు. మీ పర్యటన సందర్భంగా మరోసారి అడుగుతున్న.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు చేసిన ర్యాలీ అన్ని రాష్ట్రాల్లో చేయండి ప్రజాస్వామ్యం రావాలి ప్రజాస్వామ్యం కాపాడబడాలి అర్హులైన ఓట్లు ఉండాలని మంత్రి పోన్నం అన్నారు. దేశీయుల ఓట్లు తీసేశాం అంటున్నారు కాదా.. రిని వారి దేశాలకు తిప్పి పంపించారా? ఎంత మందిని పంపించారు? మీ సర్ ప్రక్రియలో ఎంతమంది విదేశీయుల ఓట్లు తొలగించారో ఆదారాలు చెబుతారా అని అన్నారు.
SIR పై చర్చకు పెడుతాం రా.. పార్లమెంటు సమావేశాలు పెట్టి చర్చ చేపట్టు తెలుకుట్టిన దొంగల్లా మీరు ఓట్లు చోరి చేస్తూ దొరికిపోయారు. ఇప్పుడు పాదయాత్ర పేరుతో బుకాయిస్తారా మా 6 గ్యారెంటీలు చెబుతాం.. మీరు రైతులకు నెలవారి పించన్లు ఇస్తామన్నారు ఇచ్చారా? ఉచిత విద్యుత్ ఇస్తమాన్నారు ఇచ్చారా? ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు ఇచ్చారా? 30 శాతం ధరలు తగ్గిస్తామన్నారు చేస్తారా? లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు ఇస్తామన్నారు..ఇస్తున్నారా? ఒక్క రేషన్ కార్డు ఇవ్వని చరిత్ర మీది.. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయలేని అసమర్దులు మీరని ఫైర్ అయ్యారు. ఈ దేశంలో ఏ ఏ టాక్స్ నడుస్తుంది. అంటే అంబానీ, అదానీ టాక్స్ వసులు చేస్తున్నారు. అన్ని ఆదానీకి కట్టబెడుతున్నారు. దేశాన్ని ఆదానీకరణ చేస్తున్నారు. దేశంలో ధరలు పెరిగాయిని అన్నారు.
సామాన్యుడు చచ్చిపోతున్నాడు. మణిపూర్ మండిపోతుంది. అరుణాచల్‌లో అగ్గి పుట్టింది. దాని గురించి చెప్పడు కానీ గల్లి రాజకీయాలు చేస్తారు. మీరు హోం మంత్రా గల్లి మంత్రా అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 10 సార్లు ఓటర్ సవరణ ప్రక్రియ చేపట్టింది అర్హులైన ఓట్లు మాత్రమే తొలగించింది. Rss, బీజేపీ ఆఫీస్ నుండే ఓట్ల తొలగింపు ఫారాలు పంపిణీ జరుగుతుంది దానిపై మాట్లాడని మీరు ఏం హోంమంత్రి ఆనాడు కాంగ్రెస్ వాదులు స్వతంత్రం కోసం పోరాడారు ఈనాడు ప్రజాస్వామ్య కొరకు పోరాడతాం ఆది మా బాధ్యత అని మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు.
Also Read: అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?