E-Paper
Advertisement

కొండపై మ్యాగీ అమ్ముతూ నెలకు రూ.4.5 లక్షలు.. ఈ వ్యాపారి సంపాదన మామూలుగా లేదుగా!

కొండపై మ్యాగీ అమ్ముతూ నెలకు రూ.4.5 లక్షలు.. ఈ వ్యాపారి సంపాదన మామూలుగా లేదుగా!
Advertisement

Maggi Seller: హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్ పాస్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మంచు కొండలు, శీతల గాలులు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్యాటక ప్రాంతంలో ఓ మ్యాగీ వ్యాపారి తన రోజువారీ సంపాదన గురించి చెప్పిన విశేషాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ‘ఏ వ్యాపారమూ చిన్నది కాదు’ అనే మాటను నిరూపిస్తూ.. రోడ్ ఫుడ్ స్టాల్ ద్వారా ఏ స్థాయిలో ఆదాయం అర్జించవచ్చో తెలియజేస్తోంది. ఇందుకు సంబంధించి కంటెంట్ క్రియేటర్ హర్ష్ చౌహాన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నెలకు రూ. 4.5 లక్షల టర్నోవర్!

సాధారణంగా పర్యాటక ప్రాంతాల్లో ఆఫ్-సీజన్ సమయంలో వ్యాపారాలు మందగిస్తుంటాయి. కానీ రోహ్‌తాంగ్ పాస్‌లోని ఈ వ్యాపారికి మాత్రం కస్టమర్ల కొరతే లేదు. హర్ష్ చౌహాన్‌తో ఆ వ్యాపారి మాట్లాడిన వివరాల ప్రకారం.. ఆఫ్ సీజన్‌లో కూడా అతను రోజుకు 60 నుంచి 70 ప్లేట్ల మ్యాగీని విక్రయిస్తున్నాడు. ఒక్కో ప్లేట్ ధర రూ. 100. దీనికి తోడు రోజుకు దాదాపు 200 కప్పుల టీ (ఒక్కోటి రూ. 40)తో పాటు గుడ్ల విక్రయాలు కూడా చేస్తున్నారు. ఈ లెక్కన ఆ వ్యాపారికి రోజుకు రూ. 14,000 నుండి రూ. 15,000 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నెలకు దాదాపు రూ. 4.5 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాడని హర్ష్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వివరించారు.

మ్యాగీ, టీలకే ఎందుకంత క్రేజ్?

Advertisement

మనాలి, రోహ్‌తాంగ్ పాస్ వంటి గడ్డకట్టే చలి ఉండే పర్వత ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు వేడివేడి మ్యాగీ, టీలు లభించడం గొప్ప ఉపశమనం. తీవ్రమైన చలి, పరిమితంగా లభించే ఆహార ప్రత్యామ్నాయాల వల్ల పర్యాటకులు ఇక్కడి స్టాళ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. సాధారణ మ్యాగీతో పాటు చీజ్ మ్యాగీ వంటి రకాలకు ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది. చాలా మంది రోడ్‌సైడ్ వ్యాపారులు రోజుకు వందలాది ప్లేట్ల మ్యాగీని అమ్ముతూ మంచి రాబడి పొందుతున్నారు.

Also Read: కిచెన్ కత్తులు మెుద్దుబారాయా? ఇంట్లోని వస్తువులతో.. పదును పెట్టే మ్యాజిక్ ట్రిక్స్!

రాబడి వెనుక కఠినమైన సవాళ్లు!

Advertisement

అయితే ఈ ఆదాయ లెక్కలు చూడటానికి బాగానే ఉన్నప్పటికీ.. వీటి వెనుక ఊహించని ఖర్చులు, కష్టాలు దాగి ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సరుకులను మనాలి నుంచి కొండపైకి తీసుకురావడానికి రవాణా ఖర్చుల రూపంలోనే రోజూ దాదాపు రూ. 2,000 వరకు ఖర్చవుతుందని తెలియజేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు, తాగునీరు, డిస్పోజబుల్ ప్లేట్లు, మ్యాగీ పాకెట్లకు పెట్టుబడి ఖర్చు ఉంటుందని గుర్తుచేస్తున్నారు. మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఈదురుగాలుల మధ్య పనిచేయడం చాలా సవాలుతో కూడుకున్నదని.. పైగా కొండ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.

Also Read: కర్నూలు మేయర్ పీఠంపై ఉత్కంఠ.. పక్కా గెలుస్తామంటూ జోరుగా బెట్టింగ్..?

Tags

Related News

సమ్మెలో ఐడీబీఐ బ్యాంకులు ఉద్యోగులు.. కస్టమర్లకు బ్యాంకు కీలక సూచనలు

శాలరీ అకౌంట్‌ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?

వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు.. మీ జాబ్ భద్రంగా ఉండాలంటే ఈ 3 స్కిల్స్ తప్పనిసరి

SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. డిసెంబర్ 1 నుంచి అదనపు ఛార్జీలు

వీలునామా vs గిఫ్ట్ డీడ్.. మీ పిల్లలకు ఆస్తి ఏ రూపంలో ఇస్తే మంచిది?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లు మాయం.. మీ డబ్బులు పోతే వెంటనే ఈ 5 పనులు చేయండి

నెల జీతం సరిపోవడం లేదు.. ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న 70 శాతం భారతీయులు

Big Stories

Advertisement
×