Addanki Dayakar; రాహుల్ గాంధీ ర్యాలీ దెబ్బకు అమిత్ షా హైదరాబాద్ రోడ్లపై పడి పోటీ ర్యాలీ చేశాడు. అమిత్ షా ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, ప్రజల నుంచి కూడా స్పందన రాలేదని అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని అమిత్ షా అంటున్నాడు.. కానీ బీజేపీ క్రిటికల్ ఐసీయూలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండని అన్నారు. మోదీ, అమిత్ షా అనే ముసలి నక్కల పాలన పోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీ, అమిత్ షా ట్యాక్స్ కడుతున్నారా..? మీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోరు. నిజాయితీగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డిని దింపాలని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని దింపడం కాదు.. కేంద్రంలో మిమ్మల్ని దింపుతాం చూసుకోండని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆరు గ్యారెంటీలను మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని, కేంద్రం నుంచి పైసా సాయం కూడా చేయకుండా విమర్శలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను మా ప్రజా ప్రభుత్వం ఇస్తోంది. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వరు.. తెలంగాణలో బీజేపీకి అధికారం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. ప్రధాని మోదీ నుంచి బీజేపీ ఎంపీల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డినే భవిష్యత్తులో రాహుల్ గాంధీకి ప్రధాన ఆయుధంగా అవుతాడన్న ఉద్దేశంతోనే అమిత్ షా హైదరాబాద్ వచ్చారని, బీజేపీ పతనం మొదలైంది ముందు అది గుర్తుపెట్టుకోండని అద్దంకి చురకలంటించారు.
Also Read: మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!