Vehicle Registration Mark Changed in Telangana: ఇప్పటివరకు తెలంగాణలో వాహనాల రిజిష్ట్రేషన్ మార్కగా ఉన్న టీఎస్(TS) ఇక నుంచి టీజీ(TG)గా మారనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటర్ వెహికల్ ఆక్ట్ 1988 లోని సెక్షన్ 41(6) ప్రకారం కేంద్రం ఈ రిజిష్ట్రేషన్ మార్క్ మార్పునకు ఆమోదం తెలిపింది. 1988 జూన్ 12 నాటి గెజిట్ నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ 29ఏ కింద టీఎస్ గా ఉన్న తెలంగాణ వాహనాల రిజిష్ట్రేషన్ మార్కును టీజీగా మార్చింది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వాహనాల రిజిష్ట్రేషన్‌ను టీజీ గా మార్చాలని నిర్ణయించారు. దీనికోసం మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తీర్మానాన్ని అనుసరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ మార్క్ రానుంది.
Also Read: PM Modi Election Campaign : తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. రేపు మల్కాజ్ గిరిలో రోడ్ షో..