BigTV English

September 17 as Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

September 17 as Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
September 17-Hyderabad Liberation Day
Hyderabad Liberation Day

Central Declared September 17 as ‘Hyderabad Liberation Day’: సెప్టెంబర్ 17పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం గెజిట్‌లో పేర్కొంది.


భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే హైదరాబాద్ సంస్ధానానికి సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. ఆపరేషన్ పోలో పేరిట చేపట్టిన పోలీస్ యాక్షన్ ద్వారా ఇండియాలో ఈ సంస్ధానం విలీనమయ్యింది. హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తనున్నారని హైదరాబాద్ సంస్ధాన విముక్తి కోసం పొరాడి అమరులైన వారిని స్మరించుకోవడానికి సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. సాయుధ రైతాంగ పోరాటం చేపట్టి నిజాంకు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ప్రజలు పోరాటం చేసారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి తోడుగా సర్ధార్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని సెప్టెంబర్ 17, 1948న ఇండియాలో విలీనం అయ్యేలా చేసింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చింది.


Also Read: ఇక నుంచి టీజీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం..

అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు. కాగా తాజాగా కేంద్రం ఇక నుంచి ఈ రోజును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని గెజిట్ జారీ చేసింది.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×