E-Paper
Advertisement

రాష్ట్రానికి వర్ష సూచన.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 40 కీమీ వేగంతో ఈదురుగాలులు..!

రాష్ట్రానికి వర్ష సూచన.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 40 కీమీ వేగంతో ఈదురుగాలులు..!
Advertisement

తెలంగాణ వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ కేంద్రం కీలక అప్‌డేట్ విడుదల చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం గణనీయంగా మారనుంది. నిన్న విదర్భ నుండి కొమొరిన్ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ప్రస్తుతం మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి విదర్భ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడే అవకాశం కనిపిస్తోంది.

వాతావరణ విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే వీలుంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయి. వర్షం పడే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత రాబోయే నాలుగు రోజుల్లో క్రమేపి తగ్గుముఖం పడుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి కంటే రెండు నుండి మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ వేడిమి తగ్గుతుండటంతో రాష్ట్ర ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పుల వల్ల పగటి పూట ఉక్కపోత కూడా తగ్గే అవకాశం ఉంది.

ఈ జిల్లాల్లో కాసేపేట్లో భారీ వర్షం.. 

Advertisement

నేటి సాయంత్రం వేళ పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. జనగాం కరీంనగర్ కొమురం భీం ఆసిఫాబాద్ ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట హన్మకొండ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాగల 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం పుష్కలంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ప్రజలు వాతావరణ సూచనలను గమనిస్తూ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.

ALSO READ: పేద విద్యార్థుల చదువులకు రూ.10 లక్షలు.. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా?

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×