E-Paper
Advertisement

Yellow Alert: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, పిడుగులు పడే అవకాశం..!

Yellow Alert: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, పిడుగులు పడే అవకాశం..!
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. మొన్న భూపాలపల్లి జిల్లాలో కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాళ్ల వర్షం కారణంగా పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వేసవి వేడి ప్రారంభం కాకముందే ఈ అకాల వర్షాలు పలకరించడం ప్రజలను షాక్ కు గురిచేస్తోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8:30 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపుల ధాటి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రైతులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనులు చేసే వారు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. వర్షం మొదలైనప్పుడు పొలాల్లోని చెట్ల కింద ఉండొద్దు. చెట్లపై పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

Advertisement

వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ పిడుగుల భయం ప్రజలను కలవరపెడుతోంది. గాలివాన తీవ్రత ఎక్కువగా ఉంటే పాత భవనాలు, ప్రహరీ గోడల చెంత నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన చోట జాగ్రత్తగా ప్రయాణించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ శాఖ ఇచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్లను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×