Telangana Drone Didi Scheme: మహిళలకు మేలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గ్రామీణ మహిళలకు కొత్త ఉపాధి కలగనుంది. ఈ పథకం ద్వారా మహిళలకు డబ్బే డబ్బు. లబ్దిదారులకు 8 లక్షల వరకు సబ్సిడీ రానుంది. ఈ పథకం డీటేల్స్‌పై ఓ లుక్కేద్దాం.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన పథకం నమో డ్రోన్ దీదీ. ఈ స్కీమ్ తెలంగాణలో మహిళలకు కలిసిరానుంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయ రంగాన్ని మోడ్రన్‌గా మార్చాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ సర్కార్. స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్ ఇచ్చి వాటిని ఎలా వినియోగించాలో ట్రైనింగ్ ఇవ్వనుంది.
ఈ పథకం ద్వారా తెలంగాణకు 381 డ్రోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. పంటలు చేతికి అందివచ్చే సమయంలో చీడ పీడల నివారణకు రసాయనాలను పిచి కారీ చేయాలి. కొన్నిచోట్ల ఈ పని కష్టంగా మారింది. డ్రోన్లల ద్వారా ఈ ప్రక్రియను అమలు చేస్తే.. రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతుంది.
ఒక్కో డ్రోన్‌పై 80 శాతం సబ్సిడీ రానుంది. ఈ లెక్కన 8 లక్షలు ఉచితంగా ఇచ్చినట్టే. మిగతా 20 శాతం వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి 3 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వనుంది. గతేడాది తెలంగాణకు 75 డ్రోన్‌లను కేటాయించింది కేంద్రం. తాజాగా కేంద్ర వ్యవసాయ .. తెలంగాణకు 381 డ్రోన్‌లను కేటాయిస్తూ లేఖ రాసింది.
ALSO READ: నన్ను లెక్క చేస్తలేరు.. భవిష్యవాణిలో అమ్మవారి ఆగ్రహం
రాష్ట్రంలో 100కు పైగా నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వీటిని ఇవ్వనున్నారు. ఈ పథకం కింద మహిళలను లబ్దిదారులుగా ఎంపిక చేయడం, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆ మహిళలకు వ్యవసాయ కార్యకలాపాల కోసం డ్రోన్‌లు ఇవ్వనుంది. ఆ డ్రోన్లను ఉపయోగించి మహిళలు.. రైతులకు సాయం చేయనున్నారు.
పొలాల్లో డ్రోన్లతో పిచికారీ చేస్తారు. ఇందుకోసం రైతులు కూలీలకు ఇచ్చే డబ్బు కంటే డ్రోన్‌కి ఇచ్చేది తక్కువే. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆదాయం వచ్చే పథకం. నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 15 వేల మంది మహిళలకు డ్రోన్‌లను ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచన.
ఈ కార్యక్రమం విజయవంతం అయితే గ్రామీణ మహిళలకు కొత్త ఉపాధి లభించనుంది. ఈ పథకం వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 102 గ్రామీణ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని మహిళా సంఘాలకు డ్రోన్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది.
మహిళలకు డ్రోన్ కావాలంటే సెర్ప్ అధికారులతో సమావేశం కావాలి. స్వయం సహాయక సంఘాల టీమ్ లీడర్ వద్ద అధికారుల వివరాలు ఉంటాయి. వారు సెర్ప్ అధికారులను కలిసి డ్రోన్ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. నేరుగా అధికారులను కలవవచ్చు. డ్రోన్ దీదీ పథకం ద్వారా చాలా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ డ్రోన్లు మహిళలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇకపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇదొక ఆదాయం వచ్చే పథకం అన్నమాట.