Riythvika:ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు నిశ్చితార్థం చేసుకొని.. ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నటి సడన్ గా నిశ్చితార్థం చేసుకొని, ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో ఆషాడమాసం సీజన్ నడుస్తున్నప్పటికీ మిగతా రాష్ట్రాలలో మాత్రం శుభకార్యాలు పుష్కలంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొన్నటికి మొన్న తమిళ నటుడు అర్జున్ చిదంబరం (Arjun Chidambaram) పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు తమిళ నటి రిత్విక (Riythvika) కూడా నిశ్చితార్థం చేసుకుంది.
సడన్గా నిశ్చితార్థం చేసుకున్న రిత్విక..
చెన్నైకి చెందిన రిత్విక 2013లో వచ్చిన ‘పరదేశి’ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మద్రాస్, కబాలి, టార్చ్ లైట్, 800 వంటి చిత్రాలతో పాటు తాజాగా వచ్చిన ఎలెవెన్, డీఎన్ఏ మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం వినోద్ లక్ష్మణ్ (Vinod Lakshman) అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాదు పెళ్లి డేట్ తో సహా ఇతర వివరాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ ద్వారా భారీ గుర్తింపు..
రిత్విక విషయానికి వస్తే.. సినిమాలతో పాటు పలు రియాల్టీ షోలలో కూడా పాల్గొంటుంది. తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొన్న ఈమె అక్కడ పెద్దగా అంచనాలు లేకపోయినా సరే విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటినుంచి మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్న ఈమె.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇక త్వరలోనే వైవాహిక బంధంలోకి కూడా అడుగుపెట్టబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వివాహం తర్వాత సినిమాలలో నటిస్తుందా లేక వైవాహిక జీవితానికి పరిమితమవుతుందా అన్నది చూడాలి.
రిత్విక కెరియర్..
రిత్విక అసలు పేరు రిత్విక పన్నీర్ సెల్వం. 1992 ఆగస్టు 5న తమిళనాడు చెన్నైలో జన్మించింది. ఇకపోతే ఈమెకు మంచి కెరియర్ ను అందించిన చిత్రం పరదేశి తీసిన ఆంగ్ల నవల ‘రెడ్ టీ’ ఆధారంగా తెరకెక్కింది. బ్రిటీష్ రాజుల కాలంలో మద్రాస్ ప్రెసిడెంట్ లో టీ తోటల కార్మికుల దుస్థితిని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా టీ తోటలలో చిత్రహింసలకు, లైంగిక దోపిడీకి గురయ్యే యువతి కరుతకన్ని పాత్రను ఈమె పోషించింది. ఈ సినిమా ఈమెకు ఊహించని ఇమేజ్ ను అందించింది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమన్ తో ‘నినైతతుయారో’ అనే సినిమాలో నటించింది. ఉత్తర చెన్నై అమ్మాయిగా మద్రాస్ సినిమాలో అద్భుతంగా నటించింది. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే చెన్నైలోని తేనంపేట లోని జస్టిస్ బషీర్ అహ్మద్ సయ్యద్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో చదువుకుంది. చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఈమె.. కాలేజ్ రోజుల్లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. వాటి ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ALSO READ:Krithi Shetty: మకాం మార్చిన బేబమ్మ.. అక్కడైనా అదృష్టం వరిస్తుందా?