High Court questioned Hydra: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా సెలవు దినాల్లో ఎలా కూల్చివేతలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులకు పాల్పడితే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అమీన్ పూర్ తహసీల్దార్ కు హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, అమీన్ పూర్ తహసీల్దార్ 21వ తేదీన డిమాలిష్ కోసం మిషనరీ కావాలంటూ లేఖ రాశారని కోర్టుకు హైడ్రా కమిషనర్ తెలిపారు. మిషనరీ, మ్యాన్ పవర్ మాత్రమే పంపామని, ఎలాంటి కూల్చివేతలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే తహసీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా? అలాగే ఆయన చెప్పారని చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు విచారణకు కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హజరయ్యారు. అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగానే హైకోర్టు హైడ్రాపై సీరియస్ అయింది.
సెలవు దినాల్లో శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాతనే ఎందుకు కూల్చివేతలు ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి అమీన్ పైర్ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సెలవుల్లో నోటీసులు ఎందుకు ఇస్తున్నారని, సమయం ఇవ్వకుండా అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు.
Also Read: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!
ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మెప్పించేందుకు కూల్చివేస్తున్నారా? అయినా చట్ట విరుద్ధంగా పని చేయరాదని హైడ్రాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. హైడ్రాకు చట్టబద్ధత, అధికారం ఏంటో చెప్పాలని, చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు కూల్చేస్తున్నారని పేర్కొంది. సెలవు దినాల్లో కూల్చివేతలు చేయకూడదని తెలియదా? అని ప్రశ్నించింది.
ప్రజలు ఇళ్లు ఖాళీ చేయకుంటే కూల్చేస్తారా? కోర్డు వద్దని చెబుతున్నా ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం, సెలవు దినాల్లో ఇంట్లో ఉండకుండా ఎందుకు పనిచేస్తున్నారని అడిగింది. ఇళ్లను కూల్చే ముందు చివరి అవకాశం ఇస్తున్నారా? కనీసం చనిపోయే ముందు ఓ వ్యక్తికి చివరి కోరక ఏంటి అని అడుగుతారు? అని మండిపడింది.