BigTV English

UI The Movie Collections: ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. మొదటిరోజు కలెక్షన్స్‌తోనే రికార్డ్ సృష్టించిన ‘యూఐ ది మూవీ’..

UI The Movie Collections: ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. మొదటిరోజు కలెక్షన్స్‌తోనే రికార్డ్ సృష్టించిన ‘యూఐ ది మూవీ’..

UI The Movie Collections: ఈరోజుల్లో ప్రతీ భాషా ఇండస్ట్రీ నుండి ఒక పాన్ ఇండియా మూవీ వస్తోంది. అలాగే కన్నడ నుండి ‘కేజీఎఫ్’ అనే పాన్ ఇండియా మూవీ వచ్చి శాండిల్‌వుడ్ రూపురేఖలనే మార్చేసింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్‌తో ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్ కూడా నిలిచాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో సక్సెస్ సాధించింది ఉపేంద్ర హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘యూఐ ది మూవీ’. ఈ సినిమా కోసం దాదాపు పదేళ్ల తర్వాత దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్నాడు ఉపేంద్ర. అలా తన కమ్ బ్యాక్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు ఈ ఏడాది విడుదలయిన కన్నడ సినిమాల్లో ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది ‘యూఐ ది మూవీ’.


ఓపెనింగ్స్ అదుర్స్

ప్రీ బుకింగ్స్ విషయంలో కూడా ‘యూఐ ది మూవీ’ రికార్డులు క్రియేట్ చేస్తుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అలాగే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయడం కోసం ఉపేంద్రనే స్వయంగా అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ఉపేంద్ర స్టైల్ సినిమాను ఆశిస్తూ ఆయన ఫ్యాన్స్ అంతా థియేటర్లకు వెళ్లారు. అనుకున్నట్టుగానే సినిమాకు చాలావరకు పాజిటివ్ టాక్ వచ్చింది. కొందరు ప్రేక్షకులు ఈ మూవీ అస్సలు బాలేదు అని చెప్పినా కూడా చాలామంది మాత్రం సినిమా సూపర్ అనే అన్నారు. అందుకే ప్రీ బుకింగ్స్ విషయంలో మాత్రమే కాకుండా ఓపెనింగ్స్ విషయంలో కూడా ‘యూఐ ది మూవీ’ దూసుకుపోయింది.


Also Read: యూఐ మూవీ రివ్యూ

కలెక్షన్స్ ఎంతంటే.?

మొదటిరోజు ‘యూఐ ది మూవీ’కి రూ.6.75 కోట్ల కలెక్షన్స్ వచ్చి అందరూ ఆశర్చపోయేలా చేసింది. 2024లో ఎన్నో కన్నడ సినిమాలు విడుదలయ్యాయి కానీ అందులో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘యూఐ ది మూవీ’ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఉపేంద్రకు గ్యాప్ వచ్చినా కూడా ఆయన ఇంకా ఫామ్‌లోనే ఉన్నాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా డిసెంబర్ 20న విడుదలయ్యింది ‘యూఐ ది మూవీ’ (UI The Movie). అందుకే కన్నడలో ఈ సినిమాకు మొదటిరోజు రూ.6 కోట్ల కలెక్షన్స్, హిందీలో రూ.1 లక్ష కలెక్షన్స్, తమిళంలో రూ.4 లక్షల కలెక్షన్స్, తెలుగులో రూ.70 లక్షల కలెక్షన్స్ సాధించింది.

గుర్తుండిపోయే సినిమా

ఉపేంద్ర (Upendra) సినిమాలు అన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి. కానీ అవి చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. ‘యూఐ ది మూవీ’ కూడా అలాంటిదే అని టీజర్, ట్రైలర్ చూసిన చాలామంది ప్రేక్షకులు ఊహించారు. అదే విధంగా చాలామందికి ఈ మూవీ నచ్చింది కూడా. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ‘కేజీఎఫ్’కి పోటీ అయినా కాకపోయినా గుర్తుండిపోయే కన్నడ సినిమాల్లో ‘యూఐ ది మూవీ’ కూడా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×