Sridhar Babu on KP Vivekanand: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సభ ప్రారంభ కాగానే విదేశీ విద్యార్థుల స్కాలర్ షిప్‌ల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, బిల్లులు క్లియర్ చేయాలంటే 10 శాతం కమిషన్ తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పదేపదే ఈ వ్యాఖ్యలు చేశారాయన. దీనిపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు.
వివేకానంద సీనియర్ సభ్యులని ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. ఇష్టానుసారం నోటి కొచ్చినట్టు ప్రభుత్వంపై డిఫమేటరీ మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలు ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ రూల్స్‌ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానం ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు.
గడిచిన పదేళ్లలో ఎవరు ఏ సందర్భంలో తీసుకున్నారనే దానిపై సభలో చర్చిందామన్నారు. స్కాలర్ షిప్‌ల అంశం ప్రాసెస్‌లో ఉందన్నారు మంత్రి. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర రాద్దాంతం చేసి సభా సమయాన్ని వృథా చేయొద్దని తెలిపారు. చివరకు ఎమ్మెల్యే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
ALSO READ: రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా.. ఎక్కడంటే ..!
అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. గొడవ పెడితే మైక్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులు జూనియర్ సభ్యులకు నేర్పించేది ఇదేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఈలోగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. కమీషన్ల ప్రభుత్వం బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. గొర్రెల పంపిణీ, దళిత బంధు స్కీమ్ వరకు వేల కోట్లను బీఆర్ఎస్ నేతలు వసూలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా స్కీమ్‌లు అందిస్తోందన్నారు.
ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రెడ్డి సంచలన ఆరోపణలు..
బిల్లులు క్లియర్ చేయాలంటే 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్న కేపీ వివేకానంద
వివేకానంద వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
కేపీ తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని- శ్రీధర్ బాబు
నోటీసులు లేకుండా ఇతరలుపై… pic.twitter.com/w0KvBABwuM
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024