Pavitra Gouda.. అప్పటివరకు కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిమితమైన హీరో దర్శన్ (Darshan) ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు. ప్రేయసి కోసం అభిమానిని హతమార్చడంతో అందరూ ఈయనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఈయన గురించి తెలిసిన చాలామంది..ఈయన తప్పు లేదని, ఒకరిని హత్య చేసే మనస్తత్వం దర్శన్ ది కాదు అంటూ చాలామంది కామెంట్లు చేసినా సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండడంతో దర్శన్ పై కేసు నమోదు అయింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా జైల్లోనే జీవితం గడిపారు. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అనే విషయాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి.
బెయిల్ మీద బయటకొచ్చిన పవిత్ర..
ఇకపోతే అభిమాని రేణుకా స్వామి(Renuka Swamy) హత్య కేసులో A1 గా నిలిచిన ముద్దాయి పవిత్ర గౌడ(Pavitra Gouda) పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేసినా.. ఆమెకు కోర్ట్ బెయిల్ నిరాకరించింది. కానీ చాలా నెలల ప్రయత్నము తర్వాత తాజాగా ఆమెకు బెయిల్ లభించింది . బెయిల్ మీద బయటకు వచ్చిన పవిత్ర నేరుగా తన ఇంటికి వెళ్తుందని అందరూ అనుకున్నారు..కానీ దర్శన్ కోసం ఆమె చేసిన పని చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. వివాహితుడిని ప్రేమించడమే కాకుండా అతడిని ప్రేరేపించి, ఒక అమాయకుడిని హత్య చేయించింది అంటూ తనపై విమర్శలు గుప్పించారు.. అటు దర్శన్ కూడా పవిత్ర వైపు చూడడానికి ఇష్టం చూపించలేదు. అయినా సరే ఆమె మాత్రం దర్శన్ పై ఉన్న తన ప్రేమను చంపుకోలేకపోయింది. అందులో భాగంగానే బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ఈమె చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దర్శన్ కోసం గుడిలో పూజలు..
అభిమాని హత్య కేసులో A1 గా ఉన్న పవిత్ర గౌడ బెయిల్ మీద బయటకు వచ్చి నేరుగా దైవదర్శనానికి వెళ్ళింది. అంతేకాదు అక్కడ దర్శన్ కోసం పూజలు కూడా చేసినట్లు కన్నడ టీవీ ఛానల్ ఒకటి తెగ వైరల్ చేస్తోంది. ఇప్పుడు ఆ వీడియో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ దర్శన్ పై ఎంత ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత జరిగినా సరే ఈమెకు ఇంకా దర్శన్ పై ప్రేమ పోలేదు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పవిత్ర తో పాటు మరో ఐదుగురికి బెయిల్..
ఇదిలా ఉండగా పవిత్ర గౌడ జైల్లో ఉన్నప్పుడు ఆమె టీనేజ్ కూతురికి సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకత పెద్ద ఎత్తున వచ్చింది. వారిపై ఇన్స్టా ఖాతా ద్వేశపూరిత వ్యాఖ్యలతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే నిందితులకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. జస్టిస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటీషన్లను విచారించారు.ఈ కేసులో మరో ఐదుగురు నిందితులకు కూడా బెయిల్ లభించింది. ఇక బెయిల్ షరతుల ప్రకారం నిందితులు కోర్టు అధికార పరిధిని విడిచిపెట్టి వెళ్లకూడదని, సాక్షులను సంప్రదించకూడదని, అలాగే భయపెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.