Whip Adluri Laxman: తెలంగాణ శాసనసభను ఇవాళ చీకటి రోజుగా వర్ణించారు విప్ ఆడ్లూరి లక్ష్మణ్. దళిత స్పీకర్‌ను అవమానించడం ముమ్మాటికీ దారుణమన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దొరల అహంకారానికి ఇది ఒక నిదర్శనమన్నారు.
స్పీకర్ మీద పేపర్లు పడేసి స్పీకర్ ఛైర్‌ను అవమానించారని, మా దేవుడు అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో బీజేపీ అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత స్పీకర్‌పై BRS ఎమ్మేల్యేలు చేసినదానిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ జరిగిన రచ్చ కొత్త మలుపు తిరిగింది.
ఈ వ్యవహారంపై అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. హరీష్‌రావు సభలో చేసిన దానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన దానికి సభ నుంచి రాజీనామా చేసి వెళ్లిన తక్కువేనన్నారు. వెల్‌లోకి రావడమే కాకుండా, పేపర్లు విసిరారని మండిపడ్డారు.
గవర్నర్ అనుమతి, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత సభలో చర్చ ఎందుకని అన్నారు. వారి బంధువులను కాపాడుకునే ప్రయత్నం బంధువుల రాష్ట్ర సమితి చేసిందన్నారు. దళిత స్పీకర్‌ను అవహేళన చేస్తూ పేపర్లు చింపి ఆయనపై వేశారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
ALSO READ: ఫార్ములా రేస్ ఇష్యూ.. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వీరంగం
అగ్రకుల అహంకారం చూపించారని, స్పీకర్‌ను కొట్టేంత పని చేశారన్నారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని రూల్స్‌ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలతో గతంలో సంపత్, కోమటిరెడ్డిలను శాసనసభ నుంచి బయటకు పంపించారన్నారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు.