ప్రేమకు జాతి, మతం, వర్ణం, డబ్బు, హోదా ఇవేవీ అవసరంలేదని సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు నిరూపించారు. ముఖ్యంగా తమకు నచ్చిన వారిని సొంతం చేసుకోవడానికి వయసులో తమకంటే చాలా పెద్దవాడిని లేదా చాలా చిన్నవాడిని వివాహం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటు హీరోలు కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇదిలా ఉండగా ఒక హీరోయిన్ ప్రముఖ కమెడియన్ ను వివాహం చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. అందులోనూ వయసులో తనకంటే చాలా పెద్ద వాడిని వివాహం చేసుకోవడంతో డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ చాలామంది ఆ హీరోయిన్ పై విమర్శలు గుప్పించారు. దీంతో తాజాగా ఆ హీరోయిన్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అసలు విషయాన్నీ తెలిపింది.
కమెడియన్ గా భారీ గుర్తింపు అందుకున్న రెడిన్ కింగ్ స్లీ..
అసలు విషయంలోకి వెళితే.. రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో కమెడియన్ గా చేసి తనకంటూ భారీ పాపులారిటీ అందుకున్నారు రెడిన్ కింగ్ స్లీ. నటుడిగా, కమెడియన్ గా తనకంటూ మంచి పేరు దక్కించుకున్న. ఈయన ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ ఆ తర్వాత నెల్సన్ (Nelson) తెరకెక్కించిన ‘వరుణ్ డాక్టర్’ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలలో కూడా అవకాశం అందుకొని భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక అలా విజయ్ (Vijay) ‘బీస్ట్’, సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ‘జైలర్’ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన గత ఏడాది తన 46 సంవత్సరాల వయసులో నటి సంగీత(Sangeetha) ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది
ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్..
ముఖ్యంగా సంగీత పై చాలామంది విమర్శలు గుప్పించారు. ఎందుకంటే ఈమె గతంలోనే క్రిష్(Krish) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక బిడ్డ కూడా జన్మించింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంగీత రెడిన్ కింగ్ స్లీ(Redin Kingslee)తో ప్రేమలో పడి చాలా కాలం తర్వాత గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా కింగ్ స్లీని ఉద్దేశించి ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా? అని కొంతమంది కామెంట్ చేస్తే.. మరి కొంత మంది సంగీత డబ్బు కోసమే కమెడియన్ ను వివాహం చేసుకుంది.. అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా దీనిపైన మాట్లాడిన సంగీత అసలు విషయాన్ని తెలిపింది.
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సంగీత..
సంగీత మాట్లాడుతూ..” మెంటల్గా నా వయసు 19, ఆయన వయసు 22.. అలాగే మేము ఇప్పటికీ ఫీల్ అవుతున్నాము. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు. కానీ ఆయన సింప్లిసిటీని మెచ్చుకొని పెళ్లి చేసుకున్నాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్” అంటూ ఎమోషనల్ అయింది. మొత్తానికైతే తనపై వచ్చిన రూమర్స్ కి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.