TG Govt: తెలంగాణలో కొత్త రూల్ వస్తోంది. ఈ రూల్ పాటించకుంటే ఇక అంతే. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రూల్ అమల్లోకి వచ్చిన వెంటనే, పాటించకుంటే పెద్ద నష్టమే పొంచి ఉంది. ఇంతకు ఆ రూల్ ఏమిటి? అసలు ఏం చేయాలనే డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
హైదరాబాద్ నగరంలో 100 కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను ఒక వాహనంలో ఉన్నానని, అయితే ఇక్కడి వ్యక్తులు అనుమానంగా ఉన్నట్లు ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ యువతి వెంటనే వాహనం నెంబర్ ను పోలీసులకు పంపింది. అలా యువతి భయమభయంగా ఉన్న కొద్ది క్షణాల్లోనే పోలీసులు వచ్చారు. ఆ యువతికి రక్షణ కల్పించారు. సాధారణంగా ఆ యువతి మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చేసి, ఆమె ఎక్కడుందో గుర్తించే లోగా జరగరాని ఘటన జరగవచ్చు. అలాంటి వాటిని చెక్ పెట్టేందుకు కొత్త రూల్ వస్తుందని చెప్పవచ్చు. ఆ రూల్ అమల్లోకి వస్తే, యువతి కాల్ చేసిన క్షణాల్లో పోలీసులు అక్కడికి ఎలా చేరుకున్నారో, అదే రీతిలో పోలీసుల సేవలు మున్ముందు అందనున్నాయి. ఆ రూల్ ఏమిటో తెలుసుకుందాం.
ఈ రూల్ అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారిగా తెలంగాణ అమలు చేసినట్లు రికార్డు సృష్టించవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే విజయవంతం చేసి, దేశంలోనే సర్వే విజయవంతంగా పూర్తి చేసిన ఘనతను అందుకుంది. అలాగే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే మళ్లీ అలాంటి రికార్డ్ సాధించినట్లవుతుంది. సాధారణంగా ఏ వాహనమైనా ఎక్కిన సమయంలో మహిళలు కాస్త అభద్రతా భావానికి లోను కావడం సహజం. అలాగే కొందరు రవాణా వాహనాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ వాహనాలలో లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ లను ఏర్పాటు చేయాలన్న నిబంధన రాబోతోంది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వెహికల్స్కు ఈ నిబంధన వర్తించనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఇది అమలు కానుంది. ఈ రూల్‌ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ డివైజ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానంగా ప్రయాణికులకు రక్షణ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాహనాలను కట్టడి చేయవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి వాహనం ఎక్కడికి వెళుతుందో ఇట్టే పోలీసులు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ నగరంలో అమలైతే ఎన్నో ఘటనలను నివారించవచ్చని ప్రజలు తెలుపుతున్నారు.
Also Read: Jaggareddy: ఎమ్మెల్సీ సీటుపై నోరువిప్పిన జగ్గారెడ్డి, కాకపోతే
కాగా కేంద్రం అనుమతులు అందిన వెంటనే ప్రభుత్వం ఈ రూల్ అమలు చేయనుంది. పాత, కొత్త వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ప్రజల భద్రత కోసం నిర్ణయం కావడంతో త్వరగా రూల్ అమల్లోకి రావాలని మహిళలు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.. మీ వాహనానికి లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ ఏర్పాటు చేసుకోండి.. లేకుంటే సీజ్ తప్పదు సుమా!