BigTV English

Shiva Rajkumar: కీమోథెరపీ చేయించుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొన్నా.. చాలా కష్టంగా అనిపించింది..

Shiva Rajkumar: కీమోథెరపీ చేయించుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొన్నా.. చాలా కష్టంగా అనిపించింది..

Shiva Rajkumar: క్యాన్సర్ వల్ల ఎంతోమంది నటీనటులు తమ ప్రాణాలు కోల్పోయారు. అలా కాకుండా క్యాన్సర్‌ను జయించి మళ్లీ నవ్వుతూ కెమెరా ముందుకు వచ్చినవారు కూడా ఉన్నారు. అందులో ఒక కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్. శాండిల్‌వుడ్‌కు గుర్తింపు తీసుకొచ్చిన రాజ్‌కుమార్ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్. కొన్నేళ్ల క్రితం పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంతలోనే శివ రాజ్‌కుమార్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ప్రకటించేసరికి ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం క్యాన్సర్ నుండి కోలుకున్న ఆయన.. అప్పటి కష్టాలను గుర్తుచేసుకున్నారు.


అన్నింటికి సిద్ధం

గతేడాది తనకు క్యాన్సర్ ఉందని శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా దానికి తగిన ట్రీట్మెంట్ కోసం ఫ్లోరిడా వెళ్తున్నట్టుగా తెలిపారు. దీంతో ఆయన ట్రీట్మెంట్ పూర్తిచేసుకొని వచ్చేవారకు తను కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూశారు. మొత్తానికి శివ రాజ్‌కుమార్ ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని వచ్చి.. ఇప్పుడు ఆయన అంతా ఓకే అయిపోయినట్టుగా మరొక వీడియో విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ ఫ్రీ అయిపోయి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఆయన పూర్తిగా కోలుకున్నానని షూటింగ్స్‌లో పాల్గొనడానికి సిద్ధమంటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో తెలిపారు.


వాళ్లే ధైర్యమిచ్చారు

అసలు క్యాన్సర్ గురించి బయటపడినప్పుడు ఆయన మానస్థిక స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని శివ రాజ్‌కుమార్ బయటపెట్టారు. ‘‘మొదట్లో ఈ విషయం తెలిసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ నా ఫ్యామిలీ, డాక్టర్లు అంతా కలిసి నాలో ధైర్యాన్ని నింపారు. కీమోథెరపీ చికిత్స తీసుకుంటూనే మరోవైపు షూటింగ్స్‌లో పాల్గొన్నాను. అది చాలా కష్టంగా అనిపించింది. 45 సినిమా క్లైమాక్స్‌లో ఎలా యాక్ట్ చేశానో ప్రేక్షకులు చూడాలి’’ అంటూ చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొన్న విషయం చెప్పుకొచ్చారు శివ రాజ్‌కుమార్. అంత ఇబ్బందుల్లో కూడా ఆయన షూటింగ్స్‌లో పాల్గొనడం చాలా గ్రేట్ అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read: రాజమౌళి వల్లే నాకు పెళ్లి కాలేదు.. చావు ఒక్కటే మార్గం.. స్నేహితుడి మరణ వాంగ్మూలం!

‘ఆర్సీ 16’ అప్డేట్

ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘ఆర్సీ 16’లో శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ‘ఆర్సీ 16’కు సంబంధించిన అప్డేట్ కూడా అందించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో తన పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో పాటు ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. ‘‘నేను మార్చి 3 నుండి మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటాను. మార్చి 5న హైదరాబాద్‌లో జరుగుతున్న ఆర్సీ 16 షూటింగ్‌లో పాల్గొంటాను. ఈ సినిమాలో నేను చాలా స్పెషల్ రోల్ చేస్తున్నాను. ఆర్సీ 16 కోసం మూడు రోజులు షూట్ చేస్తాను. ఇలాంటి కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉన్న ఫ్యాన్స్‌కు, శ్రేయోభిలాషులకు చాలా థ్యాంక్స్’’ అని తెలిపారు శివ రాజ్‌కుమార్. మొత్తానికి హీరోగానే కాకుండా కొన్నాళ్లకు సినిమాల్లో స్పెషల్ రోల్స్‌లో కూడా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరించాలని ఫిక్స్ అయ్యారు ఈ స్టార్ హీరో.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×