Allari Naresh : ప్రతి ఒక్కరి జీవితంలో రిగ్రేట్ ఫీలయ్యే క్షణాలు అంటూ కొన్ని ఉంటాయి. రోజులు గడిచిపోయిన తర్వాత అరే ఆరోజు అలా చేయకుండా ఉండాల్సిందే అని ఆలోచన రావడం సహజం. అయితే కొన్నిసార్లు కొన్ని రిగ్రేట్స్ నుంచి బయటపడవచ్చు. కానీ కొన్ని మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా అలాంటి ఒక అనుభవమే ఎదురయింది హీరో అల్లరి నరేష్ కు. అల్లరి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అక్కడితో సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే ఎన్నో కామెడీ ఫిలిమ్స్ మొదట్లో చేశాడు. అలానే కేవలం కామెడీ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా ఎంతో ప్రత్యేకత ఉన్న పాత్రల్లో కూడా కనిపించాడు నరేష్. కొన్ని పాత్రలు కేవలం నరేష్ కోసమే పుట్టాయి అనిపించేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా పరిచయమైన సినిమా గమ్యం. శర్వానంద్ కమలిని ముఖర్జీని ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. ఇకపోతే ఈ సినిమాలో గాలి శీను అనే పాత్రలో కనిపించాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ పాత్రకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవ్వించడంతోపాటు క్లైమాక్స్ లో ఎమోషన్ కి గురి చేస్తాడు. అయితే ఈ పాత్రను చేసినప్పుడు ఈవీవీ సత్యనారాయణ ఇలాంటి పాత్రలు చేయకు అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయట. ప్రముఖ దర్శకులు ఇవి సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్ సబ్జెక్ట్ ని కూడా కామెడీ పంథాలో చెప్పడం ఆయన స్టైల్.
Also Read : Game Changer Song: ‘గేమ్ ఛేంజర్’ నుండి నానా హైరానా పాట విడుదల.. శంకర్ మార్క్ కనిపిస్తోందిగా!
Also Read : Director Subbu on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని