BigTV English

Former Director of HMDA: శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..

Former Director of HMDA: శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..
Latest news in Telangana

Former Director of HMDA Sivabalakrishna(Latest news in telangana): HMDA మాజీ డైరెక్టర్ విచారణలో ఏసీబీ కీలక ఆధారాలు సంపాదించింది. పలువురు ఐఏఎస్ అధికారులకు బాలకృష్ణ లబ్ధి చేకూర్చాడని ప్రాథమిక విచారణలో గుర్తించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు సంబంధించిన ఆస్తి పత్రాలు శివబాలకృష్ణ విచారణ సందర్భంగా దొరికాయి. అలాగే బినామీ పేర్లపై భారీ ఆస్తులు కూడబెట్టారని అధికారులు తేల్చారు.


సుమారు 70శాతానికి పైగా బినామీ ఆస్తులు ఇలాగే ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ తమ్ముడు నవీన్ కుమార్, మరదలు, మేనల్లుడి పేర్లపై కోట్లాది ఆస్తులు కూడబెట్టాడు.

యాదాద్రిలో 66ఎకరాలు, జనగామలో 102ఎకరాలు, నాగర్ కర్నూలులో 30ఎకరాలు, జాఫర్‌గఢ్‌లో 50ఎకరాలు, సిద్దిపేటలో 10ఎకరాలు కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు బయటపడ్డాయి.


ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించనుంది. మరోవైపు శివబాలకృష్ణ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఎఫ్ఐఆర్ తో పాటు ఆస్తుల వివరాలు కావాలని ఈడీ,ఐటీ శాఖలు ఏసీబీకి లేఖ రాశాయి.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×