BigTV English

Kinetic E-Luna Scooter: ఒకప్పటి ‘లూనా’.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 110 కి.మీ ప్రయాణం

Kinetic E-Luna Scooter: ఒకప్పటి ‘లూనా’.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 110 కి.మీ ప్రయాణం

Kinetic E-Luna Scooter Milage and Features: మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం వాహనాలు పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ ఏర్పడింది. ఇందులో భాగంగా వాహన ప్రియుల సేఫ్టీ, ధర, మైలేజ్‌ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని.. ప్రముఖ కంపెనీలు మంచి మంచి ఫీచర్స్‌తో తక్కువ ధర కలిగిన వాహనాలను మాత్రమే ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి.


ఇలాంటి తరుణంలో ఇండియన్ మార్కెట్‌లోకి తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది. అయితే ఇది కొత్త బైక్ అయితే కాదు. ఒకప్పటి ఐకానిక్ లూనా మోపెడ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మార్కెట్‌కి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ తాజాగా ఇండియన్ మార్కెట్‌లో ఇ-లూనా ను ప్రవేశపెట్టింది.

ఈ ఎలక్ట్రిక్ లూనాను ఎక్స్1, ఎక్స్2 అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఇందులో ఎక్స్1 వేరియంట్ ధర రూ.69,990 కాగా.. ఎక్స్2 వేరియంట్‌ను రూ.74,990 (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు బైక్‌లు ఐదు కలర్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి. బ్లాక్, గ్లీన్, ఎల్లో, బ్లూ, రెడ్ కలర్స్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లభిస్తాయి.


READ MORE: Ather electric scooters : మళ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ప్రైస్ వార్.. ధర తగ్గించిన ఏథర్

ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం గణతంత్ర దినోత్సవం రోజు బుకింగ్‌లు ప్రారంభించగా.. ఇప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు దాదాపు 40 వేల మంది కస్టమర్లు దీనికోసం ఆసక్తి చూపించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సుమారు లక్ష యూనిట్ల ఇ-లూనా స్కూటర్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోందట.

స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:

ఒకప్పటి వింటేజ్ లుక్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. మల్టీ కలర్స్ లేకుండా ఏకరీతిగా బాడీ పెయింట్, వృత్తాకార హెడ్ ల్యాంప్, 150 కిలోల పేలోడ్ కెపాసిటీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపీ67 – రేటెడ్ 2.0 కెడబ్ల్యూహెచ్ లిథియం – అయాన్ బ్యాటరీ ప్యాక్ అందించారు. 22 ఎన్ఎమ్ గరిష్ట టార్కును ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీతో స్వాప్ చేసుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఇది గంటకు 50 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. దాదాపు 110 కిలో మీటర్లు ప్రయాణించగలదు. అయితే ఈ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయాలంటే 4 గంటల సమయం పడుతుంది.

READ MORE: Electric Two-Wheelers : ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లపై తగ్గిన మోజు

ఈ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ – ట్యూబ్యులర్, హై-స్ట్రెంగ్త్ స్టీల్ ఫ్రేమ్ ఆధారంగా పని చేస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. పూర్తిగా డిజిటల్ ఎల్సీడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్- స్టాండ్ సెన్సార్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. ఎక్కువ సామాగ్రీని తీసుకెళ్లటానికి అనుగుణంగా ఈ స్కూటర్ వెనుక సీటును సులభంగా వేరుచేయవచ్చు.

దేశంలోని అన్ని కైనెటిక్ గ్రీన్ డీలర్‌షిప్ నుంచి ఇ-లూనాను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే వీటిని బుకింగ్ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అలాగే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

ChatGPT UPI: చాట్‌జిపిటితో యుపిఐ పేమెంట్స్.. ఇక ఏఐ కామర్స్ ప్రారంభం

Redmi 200MP Camera: రూ15000కే 200MP కెమెరా ఫోన్.. రెడ్‌మీ లిమిటెడ్ ఆఫర్!

Farming: నారుమళ్లు, దుక్కి దున్నటాలకు గుడ్ బై, ఇక మట్టి లేకుండా వ్యవసాయం చేయ్యొచ్చు!

Jio Safety Phone: ₹799కే జియో సేఫ్టీ ఫోన్.. 7 రోజుల బ్యాటరీ, లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా

Big Stories

×