BigTV English

Yadadri Temple: యాదాద్రి ఆలయంలో ఆసక్తికర సంఘటన.. అంధులకు విఐపీ దర్శనం

Yadadri Temple: యాదాద్రి ఆలయంలో ఆసక్తికర సంఘటన.. అంధులకు విఐపీ దర్శనం

Blind Devotees in Yadadri Temple: తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పిలువబడే యాదాద్రి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి యాదాద్రి లక్ష్మినర్సింహస్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే, శనివారం యాదాద్రి ఆలయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి అంతా ఆనందపడుతున్నారు. అంతేకాదు.. యాదాద్రి ఆలయ ఈవోను అందరూ అభినందిస్తున్నారు.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యాదాద్రి ఆలయానికి శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం లైన్లలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అయితే, శనివారం కూడా యాదాద్రి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఆలయ ఈవోకు అంధులైనటువంటి ముగ్గురు భక్తులు కనిపించారు. వెంటనే ఆయన వారి వద్దకు వెళ్లి అడుగగా.. తాము స్వామివారి దర్శనం కోసం వచ్చామని వారు తెలిపారు. దీంతో ఆయన ఆ ముగ్గురిని కూడా గర్భగుడిలోకి తీసుకెళ్లి వీఐపీ దర్శనాన్ని కల్పించారు.

Also Read: వేడి వాతావరణంలో చల్లటి కబురు.. ఎల్లుండి నుంచి వర్షాలు!


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఎంతో సంతోషంగా ఉందని, తమది హైదరాబాద్ అని, స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతియేటా వస్తుంటామని, అయితే, ఈసారి స్వామివారి అనుగ్రహం వల్లే ఆయనను ఈవిధంగా దర్శించుకున్నామంటూ ఆనందపడ్డారంటా. ఇటు ఆలయ ఈవో కూడా  భావోద్వేగానికి గురయ్యారంటా. తన ఇన్నేళ్ల సర్వీసులో సంతృప్తినిచ్చిన సేవ ఇదేనని చెప్పారంటా. ఈ విషయం తెలిసి ఈవోను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆలయంలో అంధులకు అంతటి ప్రాధాన్యతనివ్వడం శుభపరిణామంటూ పేర్కొంటున్నారు.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×