Big Stories

NEET Exam 2024: నేడు నీట్ ఎగ్జామ్.. విద్యార్థులూ ఈ పొరపాట్లు చేయకండి..!

NEET Exam 2024 Today: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకై నీట్ -2024 (NEET 2024) పరీక్ష మే 5న జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే అభ్యర్థుల అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసి.. పరీక్ష నిర్వహణకై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది నీట్ యూజీ 2024 పరీక్షకు 23 లక్షల 81 వేల 833 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే కాకుండా.. 13 భాషలలో పెన్ – పేపర్ విధానంలో పరీక్ష జరగనుంది.

- Advertisement -

ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎల్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సులలో ప్రవేశాలకై జరిగే ఈ నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

- Advertisement -

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు.. గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫొటోను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

Also Read: తెలంగాణలో టెట్ పరీక్షల తేదీలు మార్పు

పొడవాటి చేతులున్న దుస్తులు, షూస్, నగలు, ఇతర మెటల్ వస్తువులని పరీక్ష హాల్ లోకి అనుమతించరు. అలాగే చెప్పులు, ఫ్లాట్ సాండల్స్ మాత్రమే వేసుకోవాలి.

ప్లాస్టిక్ పౌచ్ లు, జామెట్రీ, పేపర్స్, కాలిక్యులేటర్లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పెన్నులను కూడా అనుమతించరు.

చేతి వాచీలు, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్, క్యాప్ లను కూడా అనుమతించరు.

ఆఫ్ లైన్ లో మొత్తం 3 గంటల 20 నిమిషాల పాటు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. 720 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News