BigTV English

Krishna River Management Board: కృష్ణా జలాల ఇష్యూ.. బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి

Krishna River Management Board: కృష్ణా జలాల ఇష్యూ.. బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి
Latest news in telangana

Krishna River Management Board Issue: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అందుకే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అంటే ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్టే కదా. కానీ ఈ తీర్మానం వల్ల ఒరిగేదేది లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నల్గొండ వేదికగా నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో తీర్మానం దండగ అని కేసీఆర్ విమర్శించారు.


అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు తీర్మానానికి మద్దతు తెలిపారు. మరి గులాబీ బాస్ ఆదేశాలతోనే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు. సభలో అలా వ్యవహరించింది. మరి నల్గొండ సభలో కేసీఆర్ తీర్మానం వృథా ప్రయోస అని ఎందుకన్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

మరికొన్నిరోజుల్లో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.కృష్ణా జలాల అంశాన్నే పట్టుకుని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకునే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఒకలా, బహిరంగ సభల్లో బీఆర్ఎస్ వ్యహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కేఆర్‌ఎంబీపై చర్చ పెట్టి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరింది. అయితే కేసీఆర్ మాత్రం కనీసం అసెంబ్లీకి కూడా రాలేదు. కానీ నల్లొండలో సభలో కేసీఆర్ కేఆర్ఎంబీపై తీర్మానం దండగ అని విమర్శించారు. అంటే హరీష్ రావు ఆమోదం తెలిపినా.. గులాబీ బాస్ మాటలతో బీఆర్ఎస్ లో హరీష్ రావు కు విలువ లేదని తేలిపోయింది. దీంతో కేఆర్ఎంబీపై బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని అర్థమవుతుంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×