BigTV English

Benefits of Black Apple: బ్లాక్ ఆపిల్స్.. వీటి స్పెషల్ తెలుసా..!

Benefits of Black Apple: బ్లాక్ ఆపిల్స్.. వీటి స్పెషల్ తెలుసా..!

Interesting Facts about Black Apple: మనం రెడ్ లేదా గ్రీన్ కలర్ ఉన్న ఆపిల్స్‌‌ను ఎక్కువగా తింటాము. మనకు మార్కెట్‌లో కూడా ఎక్కువగా అవే కనిపిస్తాయి. నిజానికి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఆపిల్స్ ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 7,500 రకాల ఆపిల్స్ ఉన్నాయట. వాటిలో మనకు కనిపించేవి చాలా తక్కువ అని చెప్పాలి. మనం దేశంలో కూడా రెడ్,గ్రీన్ కలర్ ఆపిల్స్ మాత్రమే దొరుకుతాయి.


ఈ ఆపిల్స్‌లో చాలా అరుదైన, ఖరీదైన ఆపిల్ ఒకటి ఉంది. దాన్నే బ్లాక్ ఆపిల్స్ లేదా బ్లాక్ గోల్డ్ డైమండ్ ఆపిల్స్‌గా పిలుస్తారు. బ్లాక్ ఆపిల్స్ ఎక్కడపడితే అక్కడ కనిపించవు. ఇవి కేవలం టిబేట్‌లోనే పండుతాయి. ఇవి చూడటానికి బయటకి బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి. దగ్గర నుంచి చూస్తే ముదురు ఊద రంగులో ఉంటాయి. కట్ చేస్తే మాత్రం లోపల సాధారణ ఆపిల్ లానే ఉంటుంది.

ఇతర ప్రాంతాలో పోలిస్తే టిబేట్‌లోని పగటి ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉంటుంది. అక్కడి సూర్యరశ్మి కారణంగా ఈ ఆపిల్స్ బ్లాక్ కలర్‌లోకి మారుతాయి. టిబేట్‌లో బ్లాక్ ఆపిల్స్‌ను సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్లో ఎత్తులో సాగుచేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే చైనా, అమెరికాలో ఈ బ్లాక్ ఆపిల్స్‌ సాగును ప్రారంభించారు.


Read More: మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా..? క్యాన్సర్ మచ్చలా..?

అయితే మీరు బ్లాక్ ఆపిల్స్ టేస్ట్ చూడాలంటే కాస్త ఎక్కువగానే డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆపిల్ ఒక్కో పండు ధర రూ.500 వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ పండ్లను సాగు చేయడం చాలా కష్టమైన పని.

ఈ బ్లాక్ ఆపిల్ చెట్లు కాతకు వచ్చేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది. ఒకసారి కాతకు వస్తే ఏడాదిలో రెండు నెలల మాత్రమే పండ్లను అందిస్తాయి. ఈ ఆపిల్ పండ్లు కాసిన వెంటనే తినకూడదు. వీటిని ఎంతో కాలం నిల్వ చేయాల్సి ఉంటుంది. కాబట్టే ఈ పండ్లను సాగు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వీటి రుచిలో పెద్ద తేడా ఏమి ఉండదు. అన్ని ఆపిల్స్‌లానే వీటి రుచి ఉంటుంది.

Read More: సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!

ఈ బ్లాక్ ఆపిల్స్‌ను టిబేట్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. మన దేశం కూడా బ్లాక్ ఆపిల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. మీకు ఎక్కడైనా బ్లాక్ ఆపిల్స్ కనిపిస్తే మిస్ చేయకండి. ధర ఎక్కువైనా జీవితంలో ఒక్కసారైన తినాల్సిన పండు ఇది.

బ్లాక్ ఆపిల్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలానే బ్లాక్ ఆపిల్స్ రోగనిరోధక శక్తి కూడా పెంచుతాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను కరిగిస్తుంది. చర్మం పై ఉన్న మచ్చలను తగ్గించడంలో బ్లాక్ డైమండ్ ఆపిల్ ముందుంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×